• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్‌ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!

  ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.

  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

  కృష్ణమ్మ

  టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.

  ప్రతినిధి 2

  నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది.  సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 25న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. 

  జితేందర్‌ రెడ్డి

  ఉయ్యాల జంపాల ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ఆరంభం

  మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

  కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌

  హాలీవుడ్‌లో ‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్‌ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్‌ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ. 

  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు

  గీతాంజలి మళ్లీ వచ్చింది

  హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి. 

  ఆవేశం 

  పుష్ప ఫేమ్‌ విలన్‌ ఫహాద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఆవేశం‘. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది. 

  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  https://telugu.yousay.tv/tfidb/ott

  TitleCategoryLanguagePlatformRelease Date
  Bodkin SeriesEnglishNetflixMay 09
  Mother Of The BrideMovieEnglishNetflixMay 09
  Thank You NextSeriesEnglishNetflixMay 09
  AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09
  The GoatSeriesEnglishAmazon primeMay 09
  YodhaMovieHindiAmazon primeMay 10
  8AM MetroMovieHindiZee 5May 10
  All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8
  Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10
  RomeoMovieTamilAhaMay 10
  Dark MatterSeriesEnglishApple Plus TvMay 8
  Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv