టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్ ఫాజిల్ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’
తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.
‘సుకుమార్ కోసమే ఒప్పుకున్నా’
ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు.
నా ఫేవరేట్ స్టార్స్ వారే: ఫహాద్
యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్ కుమార్ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్ కపూర్ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి