ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్ఆర్’, ‘హనుమాన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమాలకు ముందు టాలీవుడ్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. బాలీవుడ్ వర్గాలకు తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చిన్నచూపు ఉండేదని అప్పట్లో టాక్ వినిపించింది. ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన పాన్ ఇండియా చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి డైరెక్టర్ల ప్రతిభ హిందీ స్టార్లను ఆకర్షిస్తోంది. దీంతో వారు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు టాలీవుడ్ డైరెక్టర్లతో బాలీవుడ్ స్టార్స్ సినిమాలు కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్లు ఎవరు? ఏ బాలీవుడ్ స్టార్‌తో వారు సినిమా చేయబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం.
రణ్‌వీర్ – ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma).. ‘హనుమాన్’ (Hanu Man) చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రశాంత్ అంటే బాలీవుడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో సినిమా చేసే అవకాశం దక్కింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్‌వీర్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.
సన్నీ డియోల్ – గోపిచంద్ మలినేని
దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)కి టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. కొత్త తరహా కథతో అద్భుతమైన యాక్షన్ చిత్రాలను ఆయన రూపొందిస్తుంటారు. ఇలా వచ్చి సూపర్ హిట్ సాధించినవే ‘క్రాక్’ (Krack), ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు. ఇదిలా ఉంటే అతడికి బాలీవుడ్ నుంచి సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గదర్ 2’ (Gadar 2)సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న సన్నీ డియోల్ (Sunny Deol)తో గోపిచంద్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఆయన శైలీలోని యాక్షన్ డ్రామాగా రానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చేనెలలో మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
షాహిద్ కపూర్ – వంశీ పైడిపల్లి
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally).. గత కొంతకాలంగా తెలుగు హీరోలకంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌తో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత చిత్రం ‘వారసుడు’లో విజయ్ హీరోగా చేశాడు. ఇక తన అప్‌కమింగ్ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాహిద్ కపూర్ (Shahid Kapoor)ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షాహిద్ కపూర్‌కు కథ చెప్పి ఒప్పించినట్లు కూడా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్రాలను డబ్ చేసి విడుదల చేసే గోల్డ్‌మైన్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
సాయి రాజేశ్
గతేడాది జులైలో రిలీజైన ‘బేబీ’ (Baby) చిత్రం టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్‌కేఎన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ కిడ్ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు సాయి రాజేశ్.. బాలీవుడ్ ప్రేక్షకులను ఏమేరకు ఆకర్షిస్తాడో చూడాలి.
సందీప్ రెడ్డి వంగా – రణ్‌బీర్ కపూర్
టాలీవుడ్ అగ్రెసివ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన రీసెంట్ చిత్రం ‘యానిమల్’ (Animal).. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)ను గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్‌గా ఈ సినిమాలో చూపించాడు. అయితే యానిమల్‌కు సీక్వెల్ కూడా భవిష్యత్‌లో రానుంది. రణ్‌బీర్‌ను మరింత వైలెంట్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించనున్నారు. ప్రస్తుతం సందీప్.. ప్రభాస్ స్పిరిట్ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత ‘యానిమల్ 2’ పట్టాలెక్కనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!