• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 

    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు

    విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

    రోల్స్ రాయిస్ ఫాంటమ్ 

    ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    టయోటా ల్యాండ్ క్రూయిజర్ 

    చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.

    రేంజ్ రోవర్ వోగ్ 

    ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.

    2. విలాసవంతమైన ఇల్లు

    హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన & విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు.

    3. ప్రైవేటు జెట్‌

    చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

    4. రియల్‌ ఎస్టేట్‌

    మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. 

    5. అంజనా ప్రొడక్షన్స్‌

    1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి. 

    6. కేరళ బ్లాస్టర్స్‌

    ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 

    7. చిరంజీవి బ్లడ్‌ & ఐ బ్యాంక్‌

    1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ & ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

    8. చిరంజీవి నెట్‌వర్త్

    ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv