• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 

    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం. 

    మహేశ్ బాబు

    టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు. 

    జూనియర్ ఎన్టీఆర్

    వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్. 

    పవన్ కళ్యాణ్

    ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.

    నాగార్జున

    భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు. 

    రామ్‌చరణ్ తేజ్

    రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు. 

    అఖిల్, వరుణ్ తేజ్

    రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv