• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Holi Special Songs Telugu

  తెలుగు సినిమాల్లో హోలీ పండ‌గ‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. ద‌ర్శ‌కుడులు సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా హోలీ పాట‌ల్ని పెట్టి పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టిస్తుంటారు.  అయితే అలా తెలుగులో సూప‌ర్ హిట్ అయిన బెస్ట్ రంగోలి సాంగ్స్‌ ఏంటో తెలుసుకుందాం.

  1. అందానికే అందానివా (మురారి)

  మురారి సినిమాలోని ‘అందానికే అందానివా’ సాంగ్ హోళి సంద‌ర్భంలో వ‌స్తుంది. ఈ పాట అప్ప‌ట్లో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఈ పాట‌లో మురారి ఆమె ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌ట్లు సోనాలీ బింద్రే ఊహించుకుంటుంది. త‌ర్వాత నిజంగానే మ‌హేశ్ బాబు వ‌చ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. హోలీ పండ‌గ‌కు హోలికా ద‌హ‌నం చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌లో ఆ మంట చుట్టూ తిరుగుతూ హీరోయిన్ ఫ్రెండ్స్ పాట పాడుతుంటారు. కానీ ఈ సాంగ్‌లో లొకేష‌న్ మారిన‌ప్ప‌టికీ ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆ హోలీ మంట క‌నిపిస్తుంటుంది.

  2. రంగు ర‌బ్బా ర‌బ్బా ( రాఖి )

  ఎన్‌టీఆర్, ఇలియానా న‌టించిన రాఖి సినిమాలో ‘రంగు ర‌బ్బా ర‌బ్బా’ సాంగ్ చూసేందుకు హుషారుగా , ఉత్సాహంగా ఉంటుంది. దీనికి దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. ఎన్‌టీఆర్‌ ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశాడు. అప్ప‌ట్లో బొద్దుగా ఉన్న ఎన్‌టీఆర్‌ను ఇందులో చూడ‌వ‌చ్చు. లిరిక్స్ కూడా ఒక్కో సంద‌ర్భానికి ఒక్కో రంగు గురించి వ‌ర్ణిస్తూ రాసిన విధానం బాగుంటుంది. అమల్ రాజా, ప్రియ క‌లిసి ఈ పాట పాడారు. ఈ సినిమాకు కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  3. కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు ( మాస్ )

  మాస్ మూవీలో కొట్టు ‘కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు’ అనే సాంగ్ ఉంటుంది. నాగార్జున, ఛార్మీ ఈ పాట‌కు స్టెప్పులేస్తారు. హోలీ పండ‌గ‌ను ఆ కాల‌నీ వాళ్లంతా సంతోషంగా సెల‌బ్రేట్ చేసే సంద‌ర్భంలో ఈ పాట ఉంటుది. నాగార్జున గ‌తం గురించి తెలియ‌న ఛార్మీ అత‌డిని ప్రేమిస్తుంటుంది. కానీ ఆయ‌న ఆమె నుంచి త‌ప్పించుకొని తిరుగుతుంటాడు. ఈ మూవీలో మ‌రో హీరోయిన్‌గా జ్యోతిక కూడా న‌టించింది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు.

  4. దిల్ దివానా మే హ‌సీనా ( జెమినీ )

  జెమినీ మూవీ నుంచి ‘దిల్ దివానా మే హ‌సీనా’ పాట హోళి సంద‌ర్భంలో వ‌స్తుంది. న‌మిత‌, వెంక‌టేష్ ఈ సినిమాలో న‌టించారు. ఆర్ పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందించాడు. సింగ‌ర్ ఉషా పాట‌ను పాడింది. ఉమ్మ‌డి కుటుంబంలో అంద‌రూ సంతోషంగా హోలీ సెల‌బ్రేట్ చేసుకునే సంద‌ర్భంలో పాట ఉంటుంది. త‌మిళ మూవీ జెమినీ రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త‌మిళంలో విక్ర‌మ్, కిర‌ణ్ రాథోడ్ హీరో జంట‌గా న‌టించారు.

  5. రంగ్ దే ( అఆ )

  త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్ంలో తెర‌కెక్కిన ‘అఆ’ సినిమాలోని ‘రంగ్ దే’ పాట అప్ప‌ట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. నితిన్, స‌మంత న‌టించిన ఈ మూవీలో హీరోతో ప్రేమ‌లో ప‌డిన సామ్ త‌న జీవితం రంగుల‌తో నిండిపోయిన‌ట్లుగా ఫీల‌వుతుంది. ఆ సంద‌ర్భంలో వ‌చ్చే ఈ పాట‌ను ర‌మ్య బెహ్ర‌, రాహుల్ నంబియార్, సాయి శివాణి క‌లిసి ఈ పాట‌ను ఆల‌పించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించారు.

  6. రంగేళి హోళి ( చ‌క్రం )

  ప్ర‌భాస్, ఛార్మీ న‌టించిన ‘చ‌క్రం’ సినిమాలో ‘రంగేళి హోళి’ అనే హోళి పాట ఉంటుంది. ఈ సినిమాకు చ‌క్రి సంగీతం అందించాడు. ఆసిన్ కూడా ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. హోలి నుంచి మొద‌లుపెడితే మ‌నం సెల‌బ్రేట్ చేసుకునే అన్ని పండ‌గ‌ల గురించి ఈ పాట‌లో వివ‌రిస్తారు. త‌న‌కు క్యాన్స‌ర్ రావ‌డంతో మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఇంట్లో చెప్పకుండా వ‌చ్చి ఒక కాల‌నీలో వ‌చ్చి సెటిల్ అయిన ప్ర‌భాస్ గొడ‌వ‌లు, అపార్థాలు ప‌క్క‌న పెట్టి జీవితాన్ని బ‌తికి ఉన్న‌ప్పుడే అనుభ‌వించాల‌నే సందేశాన్ని అందిస్తాడు.

  7. నందామ‌య అనుకుందామ‌య ( సీతా రామ రాజు )

  ‘సీతా రామ రాజు’ సినిమాలో హ‌రికృష్ణ‌, నాగార్జున అన్నాత‌మ్ముళ్లుగా న‌టించారు. సాక్షి శివానంద్, సంఘ‌వి హీరోయిన్స్. ఇంటికి పెద్ద హ‌రికృష్ణ కావ‌డంతో అంద‌రూ ఆయ‌న‌ను చూసి భ‌య‌ప‌డుతుంటారు. కానీ ఆయ‌న వ‌చ్చి రంగు పూయ‌డంతో అంద‌రూ సంతోషించి హోలి పండ‌గ‌ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. ‘నందామ‌య అనుకుందామ‌య’ అనే ఈ పండ‌గ‌లాంటి ఈ పాట‌ను హోలీ సంద‌ర్భంగా మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

  8. సందె పొద్దు మేఘం ( నాయ‌కుడు )

  నాయ‌కుడు సినిమాలో ‘సందె పొద్దు మేఘం’ అనే పాట హోళి సంద‌ర్భంలో వ‌స్తుంది. వ‌ర్షంలో అంద‌రితో క‌లిసి ఆడుతూ పాడుతూ హోలి సెల‌బ్రేట్ చేసుకుంటాడు క‌మ‌ల్ హాసన్. ఈ పాట‌లో వెన్నెల కంటి, రాజాశ్రీ అందించిన‌ అర్థ‌వంత‌మైన లిరిక్స్ హైలెట్‌గా నిలిచాయి. దీనికి ఇళ‌య‌రాజా సంగీతం అందించాడు. ఎస్‌పీ బాల సుబ్ర‌మ‌ణ్యం పాడారు. మ‌ణిర‌త్నం త‌రకెక్కించిన‌ నాయ‌కుడు సినిమా క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం, పాట‌లు ఇలా అన్ని ఫ్రేమ్స్‌లో ఇప్ప‌టి సినిమాల‌కు స్పూర్తిగా నిలిచింది.