విశ్వనటుడు కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, మ్యూజిక్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దానికి తోడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న మూడో సినిమా కావడంతో అందరిలో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా ? నాలుగేళ్ల తరువాత సినిమా చేస్తున్న కమల్ హిట్టు కొట్టాడా ? డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హ్యాట్రిక్ కొట్టాడా అనే విషయాలను చర్చించుకుందాం.
కథనం
నగరంలో పోలీసుల వరుస హత్యలను చేస్తున్న మాస్క్ ముఠాను పట్టుకునేందుకు అమర్ (ఫహద్ ఫాసిల్) ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతను సంతానం (విజయ్ సేతుపతి) అనే గ్యాంగ్‌స్టర్ గురించి తెలుసుకుంటాడు. అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్ హసన్) రిటైర్డ్ RAW ఏజెంట్‌కు సంతానం(విజయ్ సేతుపతి) చేస్తున్న కిడ్నాప్‌లు, డ్రగ్ మాఫియా గురించి లింక్ ఉంటుందని అమర్ (ఫహద్ ఫాసిల్) తెలుస్తుంది. అయితే సంతానంతో సంబంధం ఉన్న విక్రమ్‌కు ఓ సీక్రెట్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఏమిటి ? మాస్క్ వేసుకొని పోలీసులను హత్య చేస్తున్న వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
ముగ్గురు సూపర్ స్టార్లను తెరపై చూపించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బిగినింగ్‌లో సినిమా కొంచెం స్పీడ్‌గా సాగుతున్నా తరువాత పాత్రల పరిచయం వారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. పాత్రలను ఎలివేట్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. డార్క్ థీమ్, లోకేష్ కనకరాజ్ టేకింగ్‌తో కొనసాగుతున్న మూవీకి ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. అదిరిపోయే బ్యాంగ్‌తో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో విక్రమ్(కమల్ హాసన్) ఫ్లాష్ బ్యాక్, ఫాహద్ ఫాసిల్ ఎమోషన్స్ వల్ల మూవీ నెమ్మదిగా కొనసాగుతున్నట్లు అనిపిస్తుంటుంది. కానీ అందులో కూడా డైరెక్టర్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, డైరెక్టర్ టేకింగ్ బోర్ కొట్టకుండా చేస్తాయి. మూవీకి అతిపెద్ద బలం క్లైమాక్స్ . మూవీ చివరి 10 నిమిషాలు చాలా అద్భుతంగా అంటుంది. ఓ చిన్న పాత్రలో సూర్య వచ్చి అలరిస్తాడు. భయంకరమైన లుక్‌లో సూర్య పాత్ర ఆకట్టుకుంటుంది.
నటీనటులు ఎలా నటించారంటే..
విక్రమ్ పాత్రలో కమల్, అమర్ పాత్రలో ఫాహద్ ఫాసిల్, సంతానం పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. తమకు ఇచ్చిన పాత్రలను 100 శాతం న్యాయం చేశారు. ఎమోషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా మెప్పించారు. డైరెక్టర్ చెప్పినట్లుగా పాత్రల్లో ఒదిగిపోయారు. ముగ్గురు ఎవరికీ తీసిపోకుండా అద్భుతంగా నటించి మెప్పించారు. సూర్య పాత్ర చిన్నదే అయినప్పటికీ డేంజరస్ లుక్‌లో కనిపించాడు.
సాంకేతిక విషయాలు
డైరెక్టర్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. అతని టేకింగ్ హాలీవుడ్ టేకింగ్‌ను ప్రతిబింబిస్తుంది. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. ఎలివేషన్ సన్నివేశాల్లో అతని మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ముగ్గురు స్టార్‌లకు మూడు వేరే వేరే బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. కెమెరామెన్ గిరీష్ గంగాధరన్ పనితనం బాగుంది. మూవీని డైరెక్టర్ ఎలా చూపించాలని అనుకున్నాడో అలా చూపించాడు.
బలాలు
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ నటన
అనిరుద్ మ్యూజిక్
లోకేష్ కనకరాజ్ టేకింగ్
ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్స్
సినిమాటోగ్రఫీ
బలహీనతలు
ఎమోషనల్ సన్నివేశాలు
సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించడం
బిగినింగ్ పార్ట్ స్పీడ్‌గా కొనసాగడం
రేటింగ్ – 3/5
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి