• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తికేయ 2 మూవీ ఫుల్ రివ్యూ

    హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన కార్తికేయ 2 మూవీ నేడు (ఆగస్టు 13న) థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్ గా వచ్చింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదేస్టోరితో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. బింబిసార, సీతా రామం చిత్రాల విజయం తర్వాత, ఈ వారాంతంలో కార్తికేయ 2 కూడా చేరిందని ప్రేక్షకులు అంటున్నారు. అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.

    కథ

    కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ) వృత్తిరీత్యా వైద్యుడు. మరోవైపు కొన్ని అంతుచిక్కని ప్రశ్నల కోసం శోధిస్తుంటాడు. కార్తికేయ మూవీలోని సుబ్రమణ్యపురంలో మాదిరిగా ఇందులో ద్వారకలో జరిగే పరిస్థితుల గురించి అన్వేషిస్తాడు. ఇతని రిసేర్చ్ లో భాగంగా శ్రీకృష్ణుని గురించి పురాతన ఆచారాలు, నమ్మకాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు ఇదే పరిశోధనలో శ్రీకృష్ణుని శక్తి, రహస్యాలు కార్తికేయ కనుగోన్నాడా ? హీరో పడిన ఇబ్బందులు ఏంటి? కొన్ని అంతుచిక్కని ప్రశ్నల గురించి ఎలా అన్వేశించాడు? ఉత్కంఠతో కూడిన సీన్ల వెనుక సిక్రేట్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ

    కార్తికేయ 2 మూవీ ప్రేక్షకులకు మంచి విజువల్ ఎక్సిపిరియన్స్ ను ఇచ్చింది. కార్తికేయ సముద్రయాన ప్రయాణం, కొంచెం మిస్టరీ, థ్రిల్లర్, హారర్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఫస్టాఫ్ వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ గురించి ప్రేక్షకుల్లో మరింత క్యురియాసిటి పెరుగుతుంది. ఆ క్రమంలో డైరెక్టర్ చేజింగ్, ఉత్తేజపరిచే సీన్లతో పలు రకాల ట్విస్టులు పెట్టాడు. ఆధునిక ప్రపంచానికి ద్వారక శ్రీకృష్ణుడి రహస్యాలు, ఆధ్యాత్మికతను సరికొత్తగా చూపించాడు. మరోవైపు కాలభైరవ మ్యూజిక్ కూడా అదిరిందని చెప్పవచ్చు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనుకున్నంతగా లేదు. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీతో చందూ మొండేటి మరోసారి దర్శకుడిగా తన ఫామ్ చూపించాడు.

    ఎవరెలా చేశారంటే

    హీరో నిఖిల్ మరోసారి ఈ థ్రిల్లర్ మూవీలో తన క్యారెక్టర్లో లీనమయ్యాడు. పలు ప్రశ్నల గురించి రహస్యాలు తెలుకునే క్రమంలో భాగంగా లుక్స్, ఎక్స్ ప్రేషన్స్ తో ఆకట్టుకున్నాడు. మరికొన్ని ఉత్కంఠ రేపు సీన్ల దగ్గర నిఖిల్ తనదైన యాక్టింగ్ శైలి చూపించాడు. ఇక హీరోయిన్ అనుపమ తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా తన పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించాడు. మరోవైపు శ్రీనివాస రెడ్డి, ఆదిత్య మీనన్, వైవా హర్ష తమదైన శైలిలో నటించి మెప్పించారు.

    బలాలు

    స్క్రిప్ట్ తాజాదనం

    విజువల్ అప్పీల్‌

    ఎంగేజింగ్ డ్రామా

    నిఖిల్ యాక్టింగ్

    బలహీనతలు

    బీజీఎమ్

    కొన్ని సీన్లలో మిస్సైన లాజిక్

    రేటింగ్ : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv