మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మేజర్ సినిమాలో మెరిసిన ముద్దు గుమ్మ శోభితా దూళిపాళ కలిసి చేసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కురుప్. ఈ సినిమాను శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించగా.. దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించాడు. సుశీన్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే..
గోపీ కృష్ణన్ క్యారెక్టర్‌లో దుల్కర్ జీవించేశాడు. గోపీ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తోచక వెంటనే ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ కూడా సరిగ్గా ఉండని గోపీ తన ప్రవర్తన కారణంగా అనేక ఇబ్బందులు పడతాడు. అక్కడే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ గోపీ డబ్బుల కోసం చిన్న, చిన్న క్రైమ్స్ చేస్తూ జీవితం నెట్టుకొస్తుంటాడు. కానీ ఒక్కసారిగా గోపీ జీవితంలోకి శారదాంబ (శోభితా దూళిపాళ) ఎంటర్ అవుతుంది. ఆమెను ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని భావించిన గోపీ ఓ పెద్ద క్రైమ్ చేసి తను చనిపోయినట్లు అందర్నీ నమ్మించి సుధాకర్ కురుప్‌గా మారతాడు. అలా మారిన కురుప్ మరో క్రైమ్ చేసి అలెగ్జాండర్ అవతారమెత్తుతాడు. సుధాకర్ కురుప్ నుంచి అలెగ్జాండర్‌గా గోపీ కృష్ణన్ (దుల్కర్ సల్మాన్) ఎందుకు మారాల్సి వచ్చిందనే మిగతా కథ..
ఎవరెలా చేశారంటే…
శారదాంబ రోల్‌లో శోభిత చక్కగా ఒదిగిపోయింది. హోమ్లీ లుక్స్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. దుల్కర్ విషయానికి వస్తే సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని వన్ మ్యాన్ షోలా నడిపించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఇక శోభిత విషయానికి వస్తే తన పాత్ర మేరకు బాగానే నటించింది. ఇక మిగతా నటుల విషయానికి వస్తే వారెవరూ మనకు తెలిసిన మొహాలు కాదు.
ఎలా ఉందంటే..
సాధారణ వ్యక్తి అయిన గోపీ కృష్ణన్ తాను చనిపోయినట్లుగా అందర్ని నమ్మిస్తాడు. కానీ ఆ విషయాన్ని దర్శకుడు క్లారిటీగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో సినిమా చేసినపుడు తర్వాత ఏమవుతుందా? అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేయాలి. కానీ ఈ సినిమాను తెరకెక్కించిన శ్రీనాథ్ అందులో అంతగా విజయం సాధించనట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు గందరగోళంగా అనిపిస్తాయి. ఇక టెక్నికల్ టీమ్ వర్క్‌కు ఎటువంటి వంక పెట్టేందుకు వీలు లేదు.
చివరగా…
కురుప్ సినిమాలో మనకు చూపించిన క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలమెంట్స్ బాగా అనిపిస్తాయి. కానీ సినిమాలో అక్కడక్కడా లాజిక్స్ మిస్సయ్యాయి. అయినా కానీ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కోసమైనా కురుప్ సినిమా చూడొచ్చు.
రేటింగ్ 2.75/5
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్