• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest Best Smart Phones Under Rs 15000: తక్కువ ధరలో మంచి కెమెరా, ఫర్ఫామెన్స్ అందిస్తున్న ఫొన్లు ఇవే!

    దసరా, దీపావళి పండగ వేళ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్,  ఫ్లిఫ్‌కార్ట్  బిగ్ బిలియన్ డేస్ భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ క్రమంలో బడ్జెట్ రేంజ్‌లో మెరుగైన ఫీచర్లతో స్మార్ట్ ఫొన్ కొనాలని చాలామంది అనుంటూ ఉంటారు. అయితే ఒకేసారి అందుబాటులో ఉండే స్మార్ట్‌ఫోన్లలో ఏది ఎంచుకోవాలో కష్టంగా ఉంటుంది.  వినియోగదారులు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లలో మెరుగైన కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ పనితీరును కోరుకుంటూ ఉంటారు. రూ. 15,000లోపు ధర విభాగం భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది, ఎందుకంటే ఇది అనేక మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ విభాగంలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసి, వివిధ బ్రాండ్లు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నాయి.

    ఇప్పుడు ఈ ధర విభాగంలోనూ అధునాతన ఫీచర్లు  అందుబాటులోకి వచ్చాయి. కొన్నేళ్ల కిందట రూ. 20,000ల పైన ఉండే స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే లభించే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇప్పుడు రూ. 15,000లోపు స్మార్ట్‌ఫోన్లలో లభిస్తోంది. అంతే కాకుండా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675, మీడియాటెక్ హెలియో P70 వంటి శక్తివంతమైన ప్రాసెసర్లు కూడా ఈ ధరలో లభ్యమవుతున్నాయి, దీనివల్ల వినియోగదారులు తక్కువ ధరకే శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను పొందగలుగుతున్నారు.

    ఇప్పుడు రూ. 15,000లోపు స్మార్ట్‌ఫోన్లలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ వంటి ఆధునిక కెమెరా టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ విభాగంలో అనేక ఆప్షన్లు ఉండటంతో, సరైన స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ మా సమీక్ష ప్రక్రియలో ఉత్తమంగా నిలిచిన స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.

    Moto G64 5G:
    Moto G64 5G గత సంవత్సరం విడుదలైన Moto G54 5G కంటే కొంచెం మెరుగైనది. ఇందులో MediaTek Dimensity 7025 SoC ఉంది, ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ హెవీ టాస్కులను కూడా బాగా చేస్తుంది. అధిక శక్తి అవసరమైన గేమ్స్‌ను తక్కువ సెట్టింగ్‌లతోనూ ఆడుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్‌అప్ ఉండి క్లియర్ ఫొటోలను తీస్తుంది. కానీ తక్కువ వెలుతురులో ఫొటోలు అంత గొప్పగా ఉండవు.
    ఈ ఫోన్‌లో ఉన్న 6,000mAh బ్యాటరీ సాధారణ వాడకంలో రెండు రోజులపాటు సరిపోతుంది.  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.

    iQoo Z9x:

    పర్ఫార్మెన్స్ పరంగా, ఈ ఫోన్ మంచి పనితీరు చూపుతుంది, ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు బాగా సరిపోతుంది. కానీ, కెమెరా పరంగా, ఇది కేవలం ఒక రియర్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పనితీరు బాగుంది.
    బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. సాధారణ వాడకంలో ఫోన్ రెండు రోజులపాటు పనిచేస్తుంది. అధిక వాడకంలో కూడా ఒక రోజు పొడుగునా బ్యాటరీ నిలుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వేగంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
    iQoo Z9x లో ప్లాస్టిక్ రియర్ ప్యానెల్ మరియు ఫ్రేమ్‌తో సాదాసీదా డిజైన్ ఉంటుంది. ధరకు తగ్గ ఫీచర్లతో వచ్చినా, ఇది IP64 రేటింగ్‌తో వస్తోంది, ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.

    Moto G45 5G:
    Moto G45 5G, మోటరోలా నుండి వచ్చిన బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటుతో ఉంటుంది, మరియు 5,000mAh బ్యాటరీతో కూడిన ఫోన్. వెనుక భాగంలో వెగాన్ లెదర్ ఫినిషింగ్,  ఫ్లాట్ ప్లాస్టిక్ ఎడ్జ్‌లు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్‌తో ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సెల్ఫీ ఫొటోలను అద్భుతంగా తీస్తుంది.

    Realme GT 6T:
    Realme GT 6T T బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నుంచి వచ్చిన మొదటిది. ప్లాస్టిక్ బ్యాక్ మరియు పాలీకార్బోనేట్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ, IP65 రేటింగ్‌ను పొందింది. ఇది పర్ఫామెన్స్ పరంగా మంచి పనితీరు కనబరుస్తుంది. ఈ ఫోన్ రోజువారీ వాడకానికి సరిగ్గా సరిపోతుంది.  హై-ఎండ్ గేమింగ్‌కి మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.. కెమెరా పనితీరు కూడా బాగుంటుంది.

    Infinix Note 40X:
    ఇన్‌ఫినిక్స్ నోట్ 40X స్మార్ట్‌ఫోన్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి, వీటిలో ఎక్కువ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ముఖ్యమైనవి. ఇది మూడు రియర్ కెమెరా సెట్‌అప్‌తో పాటు క్వాడ్ LED ఫ్లాష్‌ని కూడా కలిగి ఉంది.
    బిగ్ డిస్‌ప్లే, డ్యూయల్ స్పీకర్లతో స్మార్ట్‌ఫోన్‌లో కంటెంట్‌ని ఆస్వాదించవచ్చు. 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది.

    Samsung Galaxy F05

    ఇది రీసెంట్‌గా విడుదలైన స్మార్ట్ ఫొన్. ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను సామ్‌సంగ్‌ ఇండియా వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ F05లో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది, 720×1600 పిక్సల్స్ రిజల్యూషన్, 60Hz రీఫ్రెష్ రేట్‌ తో అందుబాటులో ఉంది. తక్కువ ధరలో వచ్చినప్పటికీ, ఆకర్షణీయమైన డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 తో పనిచేసే ఈ ఫోన్, మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. 4GB ర్యామ్‌తో పాటు, 64GB స్టోరేజీ అందించబడింది. అదనంగా వర్చువల్ ర్యామ్‌ సాయంతో 4GB వరకు పొడిగించవచ్చు. ఇంకా, మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv