• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    LGM

    భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ అన్నది ఉపశీర్షిక. హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్‌ తెలిపారు. 

    రాజుగారి కోడిపులావ్

    ‘రాజుగారి కోడిపులావ్‌’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. 

    విక్రమ్‌ రాథోడ్‌

    విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్‌ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

    మిస్టేక్‌

    అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది.

    మెగ్‌ 2

    హాలీవుడ్‌ మూవీ ‘మెగ్‌ 2’ (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్‌’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్‌ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్‌ 2 థియేటర్స్‌లోకి రానుంది. 

    మరికొన్ని చిత్రాలు

    అభివ‌న్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘దిల్ సే’ కూడా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే డ‌బ్బింగ్ సినిమాలు బ్ల‌డ్ అంట్ చాకోలెట్‌, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి.

    ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    రంగబలి

    నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు.

    TitleCategoryLanguagePlatformRelease Date
    ChoonaWeb SeriesHindiNetflixAugust 3
    The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4
    Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2
    DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5
    PareshanMovieTeluguSonyLIVAugust 4
    DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv