• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్‌ వెనక రాజమౌళి!

    దేశంలో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. గత కొన్ని నెలలుగా ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘ప్రేమలు’ (Premalu) కూడా దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోంది. గత నెలలో మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మార్చి 8న తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. రాజమౌళి తనయుడు తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయగా.. రికార్డ్‌ కలెక్షన్స్ సాధిస్తోంది. టాలీవుడ్‌లో తొలి పది రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు’ వరల్డ్‌వైడ్‌ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ‘ప్రేమలు’ కథ ఏంటి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

    వరల్డ్‌ వైడ్‌గా రికార్డ్‌ కలెక్షన్స్‌

    మలయాళం సెన్సేషన్‌ ‘ప్రేమలు’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళ వెర్షన్‌లో వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఆ ఇండస్ట్రీలో హైయస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల్లో ‘ప్రేమలు’ ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను డబ్ చేశారు.

    చరిత్ర సృష్టించిన ‘ప్రేమలు’

    దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ఈ సినిమాపై బజ్‌ ఏర్పడింది. మార్చి 8న తెలుగు వెర్షన్‌లో రిలీజైన ఈ చిత్రం.. తొలి పది రోజుల్లో  రూ.10.54 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఒక మలయాళ డబ్బింగ్‌ చిత్రం తెలుగులో మెుదటి పది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విడుదలై పది రోజులు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో  ప్రదర్శితమవడం ఆశ్చర్యపరుస్తోంది. 

    సక్సెస్‌ వెనక రాజమౌళి!

    ‘ప్రేమలు’ చిత్రం ఈ స్థాయిలో తెలుగులో విజయవంతం కావడం వెనక దర్శకధీరుడు రాజమౌళి ప్రమేయం ఉంది. ఆయన కుమారుడు స్వయంగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయడంతో మూవీ ప్రమోషన్స్‌ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. రాజమౌళి లాంటి ప్రపంచస్థాయి దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. అలాగే మహేష్‌ బాబు, అనిల్‌ రావిపూడి వంటి సినీ ప్రముఖులు ‘ప్రేమలు’పై ప్రశంసలు కురిపించడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. ఎటు చూసిన ప్రేమలు గురించి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా 10 రోజులు దాటినా విజయవంతంగా రన్‌ అవుతోంది. 

    ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం

    ప్రేమలు చిత్రం తెలుగు వెర్షన్‌.. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మలయాళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా అత్యధిక డాలర్లను వసూళ్లు చేయడం విశేషం. ఈ సినిమా ఇప్పటివరకూ 3 లక్షల డాలర్లు రాబట్టినట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. రెండో వారంలోనూ అత్యధిక వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతున్నట్లు ప్రకటించారు. 

    ఓటీటీలోకి ఎప్పుడంటే?

    ప్రేమ‌లు మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disney + Hotstar) సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను మార్చి ఫ‌స్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ మార్చి 8న, త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 

    ప్రేమలు కథేంటి?

    ‘ప్రేమ‌లు’ సినిమాను దర్శకుడు గిరీష్‌.. హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాడు. కథలోకి వెళ్తే.. స‌చిన్ ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఓ వేడుక‌లో అత‌డికి రీనూ ప‌రిచ‌యం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు స‌చిన్‌. అప్ప‌టికే ల‌వ్‌లో ఓ సారి ఫెయిలైన స‌చిన్‌. .రీనుకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన స‌చిన్‌ – రీనూ చివ‌ర‌కు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv