సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. మలయాళంలో 2018లో విడుదలైన జోసెఫ్ మూవీకి రీమేక్. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. శివాని, శివాత్మిక నిర్మాతలుగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మరి సినిమా ఎలా ఉంది స్టోరీ ఏంటి తెలుసుకుందాం
కథేంటంటే..
శేఖర్ (రాజశేఖర్) ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి. హత్య కేసులను ఛేదించడంలో దిట్ట. అందుకే ఏదైనా మిస్టరీ మర్డర్ కేసులు ఎదురైతే పోలీసులు ప్రతీసారి శేఖర్ సాయం కోరుతుంటారు. అయితే శేఖర్ జీవితం విషాదంతో నిండిపోయి ఉంటుంది. భార్యతో విడాకులు తీసుకుంటాడు. తన కూతురు కూడా అతనికి దూరం కావడంతో మద్యానికి బానిసగా మారి భారంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే తన మాజీ భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన శేఖర్, అది యాక్సిడెంట్ కాదని ముందే ప్లాన్ చేసిన హత్య అని తెలుసుకుంటాడు. ఈ హత్య వెనుక ఎవరున్నారు? శేఖర్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
కథ ప్రథమార్థంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతుంది. మర్డర్ మిస్టరీలను ఛేదించే అంశాలను చాలా చక్కగా తెరపై చూపించారు. ఆ తర్వాత శేఖర్ ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్తారు. తన ప్రేమ కథ, భార్య, కూతురు గురించి చూపిస్తారు. అక్కడ కథ కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ సమయానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. దీంతో రెండో భాగంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ ప్రారంభం నుంచే కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ మర్డర్‌ను ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ చక్కగా పండాయి. మాతృకంలో ఉన్న థ్రిల్ ఎక్కడా మిస్ కాకుండా తెరకెక్కించారు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
రాజశేఖర్ లుక్ ఈ సినిమాకు చక్కగా సరిపోయింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా తెల్లగడ్డంతో సహజంగా కనిపించాడు. ఇక శివాని, రాజశేఖర్ మధ్య తండ్రీ కూతుళ్లుగా చక్కని ఎమోషన్స్ పండించారు. శేఖర్ భార్యగా నటించిన ఆత్మీయ రాజన్, ప్రేయసిగా నటించిన ముస్కాన్, అభినవ్ గోమఠం, సమీర్, భరణి శంకర్, కన్నడ కిశోర్ వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక అంశాలు:
జీవితా రాజశేఖర్ ఒరిజినల్ కథను చిన్న మార్పులతో తెరపై చక్కగా చూపించారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మరింత థ్రిల్‌ను పెంచాడు. ఇక మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌గా మారింది. నిర్మాణ ఇలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి. ఎడిటర్ మొదటిభాగంలో కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.
బలాలు:
రాజశేఖర్
కథ
సెకండాఫ్
ఇన్వెస్టిగేషన్ సీన్స్
బలహీనతలు:
మొదటి భాగం
రొటీన్ ఫ్యామిలీ డ్రామా
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 2.5/5
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి