• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!

    సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో  ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్‌ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

    రాజమౌళి ఏమన్నారంటే?

    రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ చిత్రం గ్లోబల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. ‘మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను’ అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు. 

    జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ!

    జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్‌ (తారక్‌)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్‌) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    రాజమౌళికి అపురూప కానుక

    బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv