• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు నింగిలోకి గగన్‌యాన్ ప్రయోగం

    ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహకనౌక తొలి పరీక్షను నేడు నిర్వహించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించారు. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

    రేపు నింగిలోకి గగన్‌యాన్

    ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహకనౌక తొలి పరీక్షను నిర్వహించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించారు. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

    భారీ ప్రయోగానికి సద్ధమవుతోన్న ఇస్రో

    చంద్రయాన్-3 సక్సెస్ అందించిన ఉత్సాహంతో ఇస్రో మరో భారీ ప్రయోగానికి సద్ధమవుతోంది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో పాటు ఎక్కువ కాలం ప్రయాణించేందుకు వీలుగా మానవ సహిత అంతరిక్ష నౌకను సైతం సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. తాము నిర్మించే స్పేస్ స్టేషన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    మరోసారి చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండింగ్

    చంద్రుడిపై విజయవంతంగా ల్యాండైన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. మొదటి విడతలో ల్యాండర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ మరికొన్ని లక్ష్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంతో ఇస్రో ఆదేశానుసారం ల్యాండర్ తన ఇంజన్లను స్టార్ట్ చేసి.. దాదాపు చంద్రుడి నుంచి 40 సెం.మీ వరకు పైకి లేచింది. అనంతరం 30 – 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుత ల్యాండర్ లోని అన్ని మిషన్లు పనిచేస్తున్నాయని ఇస్రో పేర్కొంది. Chandrayaan-3 Mission:??Vikram … Read more

    జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న ‘రోవర్’

    ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టినప్పటి నుంచి ఇస్రో ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా రోవర్ చంద్రుడిపై చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. అందులో రోవర్ జాబిల్లిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తోంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి, గడ్డ కట్టిన నీటి అణువులను అన్వేషిస్తోంది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్ రెండువారాల పాటు ఇదే పనిలో ఉంటుందని ఇస్రో పేర్కొంది. Chandrayaan-3 Mission:?What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit … Read more

    చంద్రుడిపై పని ప్రారంభించిన రోవర్

    విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ నెమ్మదిగా బయటకు వచ్చింది. అనంతరం జాబిల్లిపై రోవర్ 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో పేర్కొంది. అన్ని పేలోడ్స్ సరిగ్గానే పనిచేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే రోవర్ తన పని ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. ? Official glimpse of Pragyan rover coming out of lander. @isro #Chandrayaan3 pic.twitter.com/oq7kG3gfMX — Indian Tech & … Read more

    చంద్రుడి నుంచి తొలి వీడియో

    చంద్రుడు నుంచి వచ్చిన తొలి వీడియోను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కి.మీ ముందు నుంచి చంద్రుడుపై దిగేంతవరకు వీడియో రికార్డైంది. చందమామపై ఉన్న బిలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రయాన్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ వీడియోను రికార్డు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Video of moon taken by Chandrayaan-3 lander just before touchdown released ??pic.twitter.com/yjG1wGDy1M — RVCJ Media (@RVCJ_FB) August 24, 2023