• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

  ఏపీ సీఎం జగన్‌‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తు కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈమేరకు సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

  ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

  ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. రాయలసీమలో సింగమల, ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాంధ్రాలో తెనాలి నుంచి ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనున్నట్లు వైసీపీ పేర్కొంది.

  పోలీస్ ఉద్యోగం ఒక సవాల్: సీఎం జగన్

  పోలీసు అమరవీరు సంస్మరణ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పోలీస్‌ ఉద్యోగం ఒక సవాల్.. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయి. పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సంఘ విద్రోహ శక్తుల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.

  గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది: జగన్

  ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయిబ్రహ్మణ కులాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఏటా వారి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. ఈసందర్భంగా సీఎం జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనకు ఇప్పటికీ తేడా చూడండి. ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో నిలబెట్టుకున్నాం. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది. ఇప్పుడు ప్రతి పైసా ప్రజలకోసమే ఖర్చు పెడుతున్నాం అని … Read more

  శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

  మహిళా, శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో బోధన, వైఎస్సార్ పోషణ ప్లస్, గర్భిణీలు, బాలింతలకు డ్రై రేషన్, మాంటిస్సోరి విద్యా విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఇతర పథకాల అమలుకు సీఎం జగన్ సూచనలు చేయనున్నారు.

  ఎల్లుండి జగనన్న చేదోడు నిధులు రిలీజ్

  సీఎం జగన్ మరో సంక్షేమ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. అక్టోబర్ 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నాయి బ్రహ్మాణులు, రజకులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. గత 3 ఏళ్ల నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈసారి నాలుగో విడతగా వారి ఖాతాల్లో జగన్ డబ్బులు జమచేయనున్నారు.

  నేను విశాఖకు షిఫ్ట్ అవుతాను: సీఎం జగన్

  విశాఖలోని రుషికొండలో ఇన్ఫోసిస్ ఐటీ హబ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. నాతో పాటు పరిపాలన విభాగమంతా విశాఖకు మారుతుంది. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. ఇక్కడి నుంచి ఏపీ పరిపాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏపీ అతిపెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సమీప భవిష్యత్‌లో ఐటీ హబ్‌గా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.

  నేడు విశాఖలో ఐటీ హబ్ ప్రారంభం

  నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఋషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో ఐటీ సేవలను ఇన్ఫోసిస్ ప్రారంభిస్తోంది. అలాగే దసరాకు విశాఖ నుంచి పాలన కొనసాగిస్తుండటంతో పరిపాలన భవనాలను జగన్ పరిశీలించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేయనున్నారు.

  జగన్‌పై అభిమానంతో సినిమా తీశా: RGV

  ‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది.. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది.. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను వైఎస్‌ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా … Read more

  ఫోన్ చేసి చెప్పినా తప్పుకుంటా: అనిల్ కుమార్

  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పుకోమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఫోన్‌లో ఆదేశించినా సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. YSR కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి జగనన్నతోనే ఉన్నాను. పదవిలో ఉన్నా లేకపోయినా జగనన్నతోనే ఉంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.