• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం జగన్‌కు పిచ్చి ముదిరింది: లోకేష్

    సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి ప‌ని ఒక్కటీ లేదు. దమ్ముంటే చెప్పాలి. అస‌లే సైకో అయిన జ‌గ‌న్‌కి అధికారమ‌దం ఎక్కింది. ఫ్రస్టేష‌న్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిపై జ‌గ‌న్ ప్రేలాప‌న‌లు చూస్తుంటే పిచ్చి ముదిరింద‌ని స్పష్టం అవుతోంది అని ఎద్దేవా చేశారు.

    నేడు ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష

    ఆరోగ్య శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ జరుగుతున్న తీరును పరిశీలించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీల పనుల పురోగతి, హాస్పిటళ్ళల్లో నాడు -నేడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పై అధికారులతో చర్చించనున్నారు.

    పేదవాడి కల నిజం చేశాం: సీఎం జగన్

    కాకినాడ-సామర్ల కోటలో జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఇళ్లు కాదు.. ఊళ్తు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండి పేదవాడికి సెంట్ భూమి కూడా పంచలేదు. కానీ ఇప్పుడు పేదవాడి కలను నిజం చేశాం’ అని చెప్పుకొచ్చారు.

    గర్భిణీల పౌష్ఠికాహారంలో చనిపోయిన పాము

    టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాము కళేబరమున్న ఖర్జూరాల్ని గర్భిణులకు పంపిణీ చేశారని ఆరోపించారు. సైకో జగన్‌ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చిన ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం ఉన్న ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకి ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము బయటపడినట్లు పేర్కొన్నారు. https://x.com/naralokesh/status/1712295250071310554?s=20

    యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ విడుదల

    సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని యాత్ర 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర సినిమాలో మమ్మూటి ప్రధాన పాత్రలో హిట్ కాగా.. దానికి సిక్వేల్‌గా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. తాజాగా ఆ చిత్రం నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వీ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

    నేడు వైసీపీ ప్రతినిధుల సభ

    నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. 10.30 నిమిషాలకు సభ ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. 8,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తొలిసారి బార్ కోడింగ్ పాస్‌లను వైసీపీ జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ పార్టీ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆయా శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

    సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

    వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

    మహాత్మునికి సీఎం జగన్ నివాళి

    గాంధీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. గ్రామ/వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామన్నారు. మునుముందు కూడా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాం అని పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాల సాధనగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.

    జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పంచ్‌ ప్రసాద్

    జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ సీఎం జగన్‌, మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. వైద్య సహాయానికి CMRF నుంచి నిధులు మంజూరు చేసినందుకు రుణపడి ఉంటానని తెలిపాడు. తనకు అండగా నిలిచిన వారందరికి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. వారు చూపించిన ప్రేమాభిమానాన్ని ఎప్పటికి మర్చిపోలేనంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా, ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలిబడింది. This is how LEADER should be ✅@RojaSelvamaniRK ?#YSJaganCares … Read more