• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

  ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

  డీకే శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్

  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కర్ణాటకలు రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వని మీరు.. ఇక్కడ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న మమ్మల్ని తప్పుపడుతారా? అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీని అయినా అమలు చేస్తున్నారా? బెంగుళూరులోనూ కరెంట్ కట్‌లతో పరిశ్రల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ముందు మీ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.

  రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది: డీకే

  డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ జోస్యం చెప్పారు. ‘భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతం.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మీరిప్పుడు రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ అందర్ని కలుపుకుని పోతుంది. తెలంగాణలో మార్పుకోసం దేశమంతా ఎదురుచూస్తోంది.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధాని మోదీ అన్నారు. ఇచ్చిన అన్ని గ్యారెంటీలను డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలువుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

  కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

  కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య గవర్నర్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 8 మందిలో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందినవారుగా కాగా ఇద్దరు డీకే వర్గానికి చెందినవారు. ప్రమాణ స్వీకారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు సోనియా, రాహుల్, మల్లిఖార్డున ఖర్గే … Read more

  భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

  కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సందర్భంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అధికార బీజేపీ తనను జైలులో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనకు అండగా నిలిచారని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వారికి బహుమానంగా అందజేస్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. కనకాపుర స్థానం నుంచి పోటీ చేసి శివకుమార్ గెలుపొందారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional … Read more