పవన్‌పై మండిపడ్డ మంత్రి రమేష్
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే పవన్ కళ్యాణ్‌కు కడుపుమంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. ఏ రాష్ట్రంలో జరగని ఇళ్ల నిర్మాణం ఏపీలో జరుగుతోందని నొక్కి చెప్పారు. పవన్ ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు చంద్రబాబునని చెపపారు. పిల్ల సైకోలను పోగోసుకొని వచ్చి మీటింగ్ పెడతారా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.