• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ మూడు పార్టీలు ఒకటే: కిషన్‌రెడ్డి

  TG: భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకటేనని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రిగా ఉన్నారని, తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని, భారాస కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనన్నారు.

  కిషన్‌రెడ్డికి కవిత కౌంటర్

  తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాష్ట్రంలో కరెంట్‌పై బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కిషన్‌ రెడ్డి కట్టు కథలు చెప్పడం మానుకోండి. కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయి,’ అని కవిత పేర్కొన్నారు.

  కాళేశ్వరం ప్రశ్నార్థకమైంది: కిషన్‌ రెడ్డి

  TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫ్లాప్‌ అయ్యిందని రాష్ట్ర భాజపా చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. రూ.1.20 లక్షలు పెట్టి కేసీఆర్‌ కాళేశ్వరం కడితే అది కుంగిపోతోందని విమర్శించారు. కూలిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చివరకూ కాళేశ్వరమే ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన సీఎంను కామారెడ్డి ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.

  పార్టీలో అవమానాలు జరిగాయి: బాబూమోహన్

  బీజేపీ నేత బాబూ‌మోహన్ ఆ పార్టీపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని చెప్పారు. ‘అధిష్ఠానం నిర్ణయం మేరకు బీజేపీకి రాజీనామా చేస్తా. అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. పార్టీలో అవమానాలు జరిగాయి. నా ఆత్మాభిమానం దెబ్బతింది. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు’. అని బాబూమోహన్ తెలిపారు.

  నేడు బీజేపీ తొలి జాబితా?

  తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జావ్‌డేకర్ నివాసంలో టీబీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తొలి జాబితాపై కసరత్తు చేశారు. సామాజిక వర్గాల వారిగా టికెట్ల కేటాయింపు, ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలపై తుది జాబితా ఖరారు చేశారు. ఈరోజు 11 గంటలకు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

  గత హామీలు ఎటు వెళ్లాయి: కిషన్ రెడ్డి

  బీఆర్ఎస్ మేనిఫెస్టోపై టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ విద్యా వంటి హామీలు ఎమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులకు గతిలేని బీఆర్ఎస్ సర్కారు సన్న బియ్యం ఇస్తామనడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలనే ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

  ఆలస్యమే మా స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉన్నామని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది మా పార్టీ ఇష్టం. నామినేషన్ చివరి రోజు వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.

  కేసీఆర్ ఓవైసీ కుటుంబానికి బానిస: కిషన్ రెడ్డి

  ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలి. మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ, ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లో పుట్టింది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్‌. కేసీఆర్‌ కూడా మహిళ వ్యతిరేకి. మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళ బిల్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణలో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్‌కు లేదు’ అని … Read more

  కేసీఆర్‌కు అధికారం తలకెక్కింది: కిషన్ రెడ్డి

  సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రధాని తెలంగాణకు వస్తే.. ఆయనను టూరిస్ట్‌ అనడమేంటి? కేంద్రం తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులను స్వాగతించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అధికారం తలకెక్కింది. కేటీఆర్‌ అభద్రతాభావంతో ఉన్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్‌లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంటుందిట’ అని చెప్పుకొచ్చారు.

  అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

  ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.