• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపే అభ్యర్థులను ప్రకటిస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ భరిలో నిలిపేందుకు అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. దాన్ని రేపు అధిష్ఠానం విడుదల చేస్తుంది. ఆయా స్థానాల్లో ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఎంపిక ఆలస్యం అయింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీలో చాలా మంది చేరుతున్నారు. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం నాతో మాట్లాడలేదు’. అని కోమటిరెడ్డి తెలిపారు.

    కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి.. క్లారిటీ

    TG: కాంగ్రెస్‌ చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌ ఎల్బీ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని కోరినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. భాజపా పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

    తెలంగాణ ఏమైనా పాకిస్తానా?: కోమటి రెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగింది. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.

    జగదీశ్వర్‌రెడ్డికి డిపాజిట్ దక్కదు: కోమటి రెడ్డి

    సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా అని సవాలు విసిరారు. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో జగదీశ్వర్ రెడ్డి గట్టెక్కారని గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆరోపించారు.

    భట్టిని తోసేసిన కోమటిరెడ్డి: వీడియో వైరల్

    కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. కానీ కార్యక్రమం చివర్లో అనుకోని ఘటన జరిగింది. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. వేదికపై ఉన్న నాయకులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఐక్యత చాటారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క మధ్య తోపులాట జరిగింది. కోమటిరెడ్డి తన మోచేతితో భట్టిని తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముందూ తెలంగాణ లో మీ కాంగ్రెస్ క్యాడర్ ఒకరికి ఒకరు సక్కగా నిలబడడానికి … Read more