• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కృష్ణను తలచుకుని రాధ ఎమోషనల్

  ఇటీవల కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణను తలచుకుని అలనాటి తార రాధ కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఓ షోలో గెస్ట్‌గా హాజరైన రాధ.. కృష్ణను గుర్తు చేసుకుని [ఎమోషనల్](url) అయ్యింది. ఆయన అకాల మరణం తనను కలచివేసిందని, ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పింది. ‘ఐ రియల్లీ లవ్ హిమ్’ అంటూ పేర్కొంది. కాగా కృష్ణతో కలసి రాధ దాదాపు 10 చిత్రాల్లో నటించింది. సింహాసనం, అగ్నిపర్వతం, ముగ్గురు కొడుకులు, పల్నాటి సింహం వంటి చిత్రాల్లో కృష్ణ సరసన రాధ నటించింది. Senior heroine #Radha … Read more

  మహేష్‌బాబు ఎమోషనల్

  తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమంలో మహేష్‌బాబు ఎమోషనల్ అయ్యారు. కృష్ణ దశ దిన కర్మ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ‘‘ నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో అన్నింటికన్నా గొప్పది.. అభిమానగణం. దానికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. మీ గుండెల్లో కూడా ఉంటారు. అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉండాలి’’ అంటూ భావోద్వేగం చెందారు.

  ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’

  తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ వీడియో రూపొందించారు. కృష్ణ నటించిన ఆనాటి సినిమాల్లోని సీన్స్, మహేష్ నటించిన సినిమాల్లోని సీన్స్ కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఈనెల 15న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. SuperStars "#Krishna – #MaheshBabu" … Read more

  కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

  [VIDEO:](url) సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరో ప్రభాస్‌, ఆర్‌ నారాయణమూర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా కృష్ణ పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అటు సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు సినిమా పరిశ్రమ బంద్‌ పాటించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. షూటింగ్‌ నిలిపివేయాలని కోరింది. #Prabhas Pays Last Respects to Super Star Krishna#RIPSuperStarKrishnaGaru #SuperStarKrishna #Tollywood pic.twitter.com/yqj9RZQMw2 — greatandhra (@greatandhranews) November 15, 2022

  సూపర్‌స్టార్ కృష్ణ మృతికి మోదీ సంతాపం

  సూపర్‌స్టార్ కృష్ణ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలు గెలుచుకున్న ఒక లెజండరీ సూపర్‌స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ సమయంలో మహేష్‌బాబు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’. అంటూ ట్వీట్ చేశారు. కాగా సూపర్‌స్టార్ కృష్ణ నేటి ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  కృష్ణ మృతికి కారణం ఇదేనా..!

  సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఈ రోజు తెల్లవారుజామున 4.09గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచినట్లు కాంటినెంటల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్‌ అవ్వడంతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో పాటు మెదడు కూడా దెబ్బతిని ఆయన మరణానికి దారితీసిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

  సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూత

  సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న కృష్ణ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చగా.. 20 నిమిషాల పాటు సీపీఆర్‌ అందించి ఆ తర్వాత వెంటలెటర్‌పై చికిత్స అందించారు. ఇవాళ తెల్లవారుజామున 4 గం.లకు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. కృష్ణ కుటుంబం మొత్తం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంది.

  కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన

  సూపర్‌ స్టార్ కృష్ణ పరిస్థితిపై కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఉన్న ఆయనకు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిన్న రాత్రి నుంచి కృష్ణ తమ ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన కృష్ణకు వెంటనే ఎమర్జెన్సీ చికిత్స ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మాత్రం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నారని వైద్యులు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. 24 గంటల్లో ఆయన పరిస్థితిపై మళ్లీ అప్‌డేట్‌ ఇస్తామన్నారు.

  కృష్ణ పరిస్థితిపై కుటుంబ సభ్యుల స్పందన

  సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అభిమానులు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని చెప్పారు. విజయ నిర్మల కుమారుడు,సీనియర్‌ నటుడు నరేశ్‌, ఆసుపత్రిని సందర్శించిన అనంతరం కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. రోటీన్‌ చెకప్‌ కోసమే కృష్ణ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న సూపర్‌ స్టార్‌ ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

  సూపర్‌ స్టార్‌ కృష్ణకు తీవ్ర అనారోగ్యం

  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరారు. ఆయన కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే తల్లిని కోల్పోయిన మహేశ్‌బాబు.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మళ్లీ కృష్ణ అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.