• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మణిపూర్ ఘటన అనాగరికం: కేటీఆర్

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికం. అయినా, ఈ భయానక హింసాకాండను చూస్తూ కేంద్రం మౌనంగా ఉంటోంది. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. We Indians were raging against Taliban when they … Read more

    బండి సంజయ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

    TS: బండి సంజయ్‌పై పరోక్షంగా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోడి చేతిలో ఒకపార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ నాయకులు’ అంటూ కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. బండి సంజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, బండి సంజయ్ అరెస్టును సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే … Read more

    పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్

    LIVE: పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కి నివేదిక అందించామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమమైన కమిషన్లలో టీఎస్‌పీఎస్సీ ఒకటని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్, 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించారని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన కమిషన్ టీఎస్‌పీఎస్సీ అని కొనియాడారు.

    నా కొడుకుని చూసి గర్వ పడుతున్నా: కేటీఆర్‌

    కేటీఆర్ తనయుడు హిమాన్షు ఇటీవల వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం తన తాతయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా యూట్యూబ్‌లో ఓ కవర్‌ సాంగ్‌ను విడుదల చేశారు. గోల్డెన్ అవర్ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదిక ద్వారా పంచుకున్నారు. తన కుమారుడు చేసిన పని పట్ల గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ పాట నాకు నచ్చిందని.. మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.