• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అప్పుడే పార్టీ మార్పుపై చెబుతా: ఎంపీ

  TS: ఎన్నికలకు నెలరోజుల ముందు పార్టీ మార్పుపై ప్రకటన చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఇంతవరకు నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది తనేనని వెంకట్‌రెడ్డి వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల … Read more

  మునుగోడులో బీజేపీ ఓడిందా.. గెలిచిందా?

  మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచింది. కానీ ఈ ఉత్కంఠ పోరులో తాము ఓట్ల పరంగా ఓడినా.. నైతికంగా గెలిచామంటూ బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ 86,697 ఓట్లు సాధించింది. అదే 2018 ఎన్నికల్లో కేవలం 12 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో నియోజకవర్గంలో భారీగా ఓటు బ్యాంకు సాధించామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మునుగోడులో ఓడినా తమ టార్గెట్ చేధించామని వారు తెలుపుతున్నారు.

  పాల్‌కు 805.. నోటాకు 482

  ఉత్కంఠ పోరులో బీజేపీపై టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ రౌండ్లను పూర్తి చేసుకుంటూ వచ్చి చివరికి విజయం సాధించింది. కానీ తనదైన శైలిలో మునుగోడు ప్రచారంలో పాల్గొన్న కేఏ పాల్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. అన్ని రౌండ్లలో కలిపి 805 ఓట్లు పోలయ్యాయి. 13వ రౌండ్లలో అత్యధికంగా 86 ఓట్లు రాగా, అత్యల్పంగా 15వ రౌండులో 11 వచ్చాయి. ఇక నోటాకు 482 మంది మొగ్గు … Read more

  ‘15రోజుల్లో హామీలు నెరవేర్చండి’

  TS: మునుగోడు ఉపఎన్నిక హామీలను 15రోజుల్లో నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉపఎన్నిక ఓటమిపై సమీక్ష చేసుకుని సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పనిచేస్తామని వెల్లడించారు. కార్యకర్తలెవరూ నిరుత్సాహ పడొద్దని సూచించారు. ‘మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు. కార్యకర్తలకు సలాం. టీఆర్ఎస్ గెలుపు ఎవరిదో స్పష్టం చేయాలి. కొంతమంది పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసకు రహస్యంగా సాయం చేశారు. ఈ విజయం వీరిదే. ఒక్కడిపై పోటీకి 86మంది ఎమ్మెల్యేలు, 16మంది మంత్రులను టీఆర్ఎస్ దింపాల్సి వచ్చింది’ అని బండి సంజయ్ … Read more

  ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

  TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం … Read more

  తెలంగాణ భవన్‌లో సంబరాలు

  TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు ముగియగా టీఆర్ఎస్ మెజారిటీతో దూసుకెళ్తోంది. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. Another 90k votes to be counted still. Will anything … Read more

  ఓటమిని ఒప్పుకొన్న బీజేపీ అభ్యర్థి?

  TS: మునుగోడు ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారడంతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమిని ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ‘మునుగోడు ప్రజలను టీఆర్ఎస్ ఎంతో ప్రలోభ పెట్టింది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసింది. ప్రచారం ముగిసినా టీఆర్ఎస్ నేతలు ఇక్కడే ఉన్నారు. నైతికంగా నేనే గెలిచా. నాపై గెలవడానికి టీఆర్ఎస్ 100మంది ఎమ్మెల్యేలను, మంత్రులను మోహరించింది. ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఇది అధర్మ యుద్ధం. టీఆర్ఎస్ గెలుపు నిజమైంది కాదు’ అని రాజగోపాల్ రెడ్డి వాపోయారు.

  మునుగోడు కౌంటింగ్@7.30AM

  ఉత్కంఠగా జరిగిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం రేపు తేలనుంది. అయితే, ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్రర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఉదయం 7.30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను గణను చేపట్టనున్నారు. మొత్తంగా 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసే అవకాశం ఉంది. 21 టేబుళ్ల చొప్పున లెక్కింపు ఉండనుంది. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

  మునుగోడు నివేదికపై కేసీఆర్ సంతృప్తి

  పార్టీ ఇన్‌చార్జుల నుంచి అందిన నివేదికపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో పాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రేవేట్ సంస్థల నివేదికలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను విశ్లేషించారు. కాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ పోస్టుమార్టం చేపట్టింది. పార్టీ అనుసరించిన వ్యూహం వల్ల 93 శాతం పోలింగ్ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెడతాడని పార్టీ అంచనా వేస్తోంది.

  మునుగోడులో 93.13% పోలింగ్

  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. రాత్రి 10.30 దాకా పోలింగ్ జరిగింది.. 93.13 శాతంతో రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించింది. మొత్తం ఓట్లు 2,41,805 కాగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లు 686 వచ్చాయి. దీంతో 2018 ఎన్నికల రికార్డును మునుగోడు తిరగరాసింది. 2018లో మధిరలో అత్యధికంగా 91.65% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 91.07% పోలింగ్‌తో మునుగోడు నిలిచింది. తాజాగా మళ్లీ మునుగోడే రికార్డులకెక్కింది.