మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన అభ్యర్థుల కోసం వ్యూహరచన చేస్తున్నాయి. ఉపఎన్నికలో గెలిస్తే వచ్చే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి.
సీరియస్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం
కాంగ్రెస్ అధిష్ఠానం మునుగోడు స్థానంలో గెలవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా పార్టీ కేడర్ చేజారకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. అందుకే అందిరికంటే ముందుగా మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి ఉపఎన్నిక శంఖారావాన్ని పూరించింది. బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రసంగించి, పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవర్ని నిలుపుతారానేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తే శ్రావంతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు జర్నలిస్ట్ సంఘం నేత పల్లే రవికూమార్‌తో పాటు మరికొందరు నేతలు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేరును కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమనేతగా ఉన్న గుర్తింపు ఆయనకు కలిసొచ్చే అంశం.
టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?
టీఆర్ఎస్ పార్టీ సైతం మునుగోడులో గెలిచి పార్టీకి తిరుగులేదనే సందేశాన్ని పంపాలని పథక రచన చేస్తోంది. అయితే ఈ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. 2014-018లో టీఆర్ఎస్ తరఫున కాసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజగోపాల్ రెడ్డిపై ఓడిపోయారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్లభూపాల్ రెడ్డి ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు టికెట్ కోసమే కేసీఆర్‌ను వీరు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై గెలిచారు. తమకు అవకాశం ఇస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తామనే ధీమాను కేసీఆర్ ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మదిలో ఎముందో తెలియాల్సి ఉంది. మునుగోడు కోసం ఎలాంటి వ్యూహాన్ని ఆయన రచించారో స్పష్టత రావాల్సి ఉంది. కొత్త నేతను తెరపైకి తెస్తారా? పాతవారినే బరిలోకి దింపుతారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!