• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 60 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

    తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఈ రోజు పూర్తి జాబితాను ఖరారు చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కోసం సిఫార్సు చేయాలని కమిటీ భావిస్తోంది. నిన్నటి సమావేశంలో సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. మరో 30 అసెంబ్లీ స్ఖానాల్లో ఇద్దరి అభ్యర్ధుల పేర్లు ఖరారు కాగా.. ఇంకో 30 అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లను కమిటీ ఖరారు చేసింది. ఈ రోజు మరింత వడపోత ప్రక్రియతో, అభ్యర్ధుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ … Read more

    రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తాం: రేవంత్ రెడ్డి

    బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని ధీమావ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 43 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేసుకున్నామని తెలిపారు. 90లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు గెలుస్తామని చెప్పారు. ధర్మమే కాంగ్రెస్’ను గెలిపిస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

    సభకు గ్రౌండ్ ఇవ్వకుండా కుట్రలు: రేవంత్

    బీఆర్‌ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసుకునేందుకు పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా ఆ పార్టీలు కుట్రలు చేశాయని ఆరోపించారు. ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో CWC సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 17న విజయ భేరి బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభకు భద్రత ఇవ్వాలని పోలీలను రేవంత్ కోరారు. హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని రేవంత్ విమర్శించారు.

    ప్రజలకు అండగా ఉండండి: రేవంత్

    వరదల్లో చిక్కుకున్న ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వరదల ప్రభావం తగ్గేంత వరకు బాధితులకు అండగా ఉండాలని కోరారు. అవసరమైతే నిత్యావసర సరుకులను అందించి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు.

    రేవంత్ v/s కవిత.. ట్విట్టర్ వార్

    కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యీ కవితకు మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ముందుగా రేవంత్ ట్వీట్ చేస్తూ.. ‘ఢిల్లీలో సవాల్లు…ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు…ఇది కేసీఆర్ మ్యాజిక్కు..జగమెరిగిన ‘నిక్కర్’…లిక్కర్… లాజిక్కు’ అంటూ రేవంత్ పేర్కొన్నారు. దీనికి కవిత కౌంటర్ ట్విట్ చేస్తూ. ‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ… కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం…ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ కవిత రాసుకొచ్చారు. © ANI Photo Screengrab Twitter:

    తెలంగాణకు స్వేచ్ఛ కావాలి: రేవంత్

    ప్రజాగర్జన సభలో సీఎం కేసీఆర్‌పై టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మంత్రి వర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వలేదని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదని తెలిపారు. ఎన్నికల ముందు దళితులకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు అమలుకాలేదన్నారు. తెలంగాణకు స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రేవంత్ ధీమావ్యక్తం చేశారు.

    కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

    తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్… బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాల కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు. ఇలాంటి పాలన పై “తిరగబడదాం – తరిమికొడదాం” అంటూ రేవంత్ ట్విట్టర్‌లో రాసుకోచ్చారు

    కేసీఆర్ రెండు చోట్లా ఓడిపోతాడు: రేవంత్

    సీఎం కేసీఆర్ తాను పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘గజ్వేల్‌లో ఓడిపోతాడని కేసీఆర్‌కు ముందే తెలుసు. అందుకే కామారెడ్డికి పారిపోతున్నాడు. కానీ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోబోతున్నాడు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోతాడని నేను గతంలోనే చెప్పా. బీఆర్‌ఎస్ జాబితా చూశాక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం అని తేలిపోయింది. రాబోయే ఎలక్షన్లలో 80 సీట్లకు పైగా సాధిస్తాం.’’ అంటూ రేవంత్ పేర్కొన్నారు.

    కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు సెక్యూరిటీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ సర్కార్ నాకు భద్రత తొలగించింది. కోర్టు ఆదేశాలిచ్చినా నాకు సెక్యూరిటీ కల్పించడం లేదు. అయినా నేను ప్రజల మనిషిని. నాకు సెక్యూరిటీ అవసరం లేదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సైన్యం. నేను సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు వెళ్లగలను. దమ్ముంటే సీఎం కేసీఆర్ సెక్యూరిటీ లేకుండా ఆ యూనివర్సిటీలకు రావాలి.’’ అంటూ రేవంత్ నిప్పులు చెరిగారు.

    రేవంత్ కంటే పిట్టలదొర నయం: మంద క్రిష్ణ

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటే పిట్టలదొర నయమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ విమర్శించారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై రేవంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మేదెలా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ఆ పార్టీలో ఉండడు. బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరతాడు. రేవంత్ ఇప్పటికే మూడు పార్టీలు మారాడు. రేవంత్ మాటలకు విలువ లేకుండా పోయింది. ఎస్సీ వర్గీకరణకు ఎవరు మద్ధతిస్తే వారికే అండగా నిలుస్తాం.’’ అంటూ పేర్కొన్నారు.