• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు మధ్యాహ్నం తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడు: నాగం

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్‌ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు. రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో … Read more

    ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ

    వికారాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అందివ్వనున్న 6 గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించడంటూ ఓటర్లను కోరారు.

    దశ దిశ మార్చే సమయమొచ్చింది: రేవంత్

    ఎన్నికల ద్వారా తెలంగాణ దశ దిశ మార్చే సమయమొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్‌ రైలు రాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారని తెలిపారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

    రేవంత్‌ రెడ్డిపై కవిత ఫైర్

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి శవాల మీద పేలాలు ఏరుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ”రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తెలిపారు.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘మనుషుల ప్రాణాలకు విలువ లేదు’

    HYD: గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని మండిపడ్డారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

    అందుకే రాజీనామా చేశా: పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అమ్మకానికి పెట్టారు. గత రెండేళ్లుగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు జరుగుతున్నాయి. సొంత పార్టీలోనే తాము పరాయి వాళ్లము అయ్యాం. మా బాధలు చెప్పుకునేందుకు 50 మంది బీసీ నేతలం వెళ్తే ఏఐసీసీ అపాయింట్ మెంట్ ఇవ్వదు. ఎక్కడైనా రేవంత్‌కు నమస్తే పెడితే కనీసం స్పందించడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    చంద్రబాబు 5 కేజీలు తగ్గారు: భువనేశ్వరి

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలులోని వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్లే చంద్రబాబుకు చర్మ సమస్యలు వచ్చాయని విమర్శించారు. కలుషిత నీరు తాగటం వల్ల ఆయన కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన 5 కేజీలు బరువు తగ్గారు. ఆందోళనలను పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోయారు.

    కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీకాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. జనగామా టికెట్‌ను తనకు కాకుండా మరొకరికి కేటాయించడంపై పొన్నాల ఆగ్రహంగా ఉన్నారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి జనగామా టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. దీంతో మనస్తాపం చెందిన పొన్నాల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

    మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన తప్పుడు వార్తలు రాస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ నిరసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నట్లు విమర్శించారు. ఈ వార్తల వల్ల కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు.