• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న … Read more

    స్క్రీనింగ్ కమిటీపై రేవంత్ అలక

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే పార్టీ స్క్రీనింగ్ కమిటిపై అలకబూనారు. తెలంగాణ స్క్రీనింగ్ కమటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ రేవంత్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు సీట్లు లేకపోవడం, బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళ వ్యక్తం చేశారు. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు విమర్శించారు. … Read more

    రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ నేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన జీవితం బీజేపీ, ఆరెస్సెస్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు అరెస్సెస్ నాలుక నుంచి వస్తున్నవి, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో రేవంత్ పనిచేయడాన్ని చూశాను. అరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ ప్రమాణం చేస్తారా’? అని అసదుద్ధిన్ … Read more

    బిల్లా రంగాల్లా కేటీఆర్ హరీష్ దోపిడి: రేవంత్

    టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు బిల్లా రంగాలాగా రాష్ట్రమంతా తిరుగుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ద్వారా 10 వేల ఎకరాల భూమి కాజేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టుల జేబులు నింపేందుకే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ఇంకో రెండు నెలల్లో బీఆర్ఎస్ అధికారం ముగిసి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.

    గాంధీ భవన్‌లోనే గాడ్సే: KTR

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచితే ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సీటుకు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి RSS మనిషి అంటూ కేటీఆర్ విమర్శించారు..

    KCR గెలుపు కోసమే మోదీ పర్యటన: రేవంత్

    బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల స్నేహ బంధాన్ని నిజామాబాద్‌ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే ఆ రెండు పార్టీల ఉద్దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

    రేవంత్ రెడ్డి ఇక జైలుకే: హరీష్ రావు

    ఓటుకు నోటుకు కేసులో త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి విచారణ ఆపాలని సుప్రీం కోర్టుకు పోతే కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఆ కేసు విచారణ అయ్యేది ఖాయం, రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు బిక్కమొహం వేస్తాయని పేర్కొన్నారు.

    సుప్రీంకోర్టులో రేవంత్‌కు భంగపాటు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేయడంతో రేవంత్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు.

    బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు వస్తారా?: హరీష్

    బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనపై చర్చకు పెడుదామా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హరీష్ రావు సవాలు విసిరారు. కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకి కాంగ్రెస్ పాలనపై చర్చ పెడుదాం అంటున్నాడు. సోనియాగాంధీని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నాడు అని విమర్శించారు.

    రేవంత్ పర్యటన.. ఉప్పల్‌లో ఉద్రిక్తత

    HYD: ఉప్పల్‌లో కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ పర్యటన నేపథ్యంలో రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను మందముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తులపై లక్ష్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే తీవ్రంగా దూషిస్తూ కొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడ్డారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. ‘ఎంపీ కనబడుట లేదు’ అనే పోస్టర్లు వెలిసిన అనంతరం రేవంత్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి పర్యటనలో … Read more