• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీడీపీ-జనసేన కార్యాచరణపై పవన్ చర్చ

    ఏపీలో రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెర్చించారు. ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశంపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. రైతుల ఇబ్బందులు సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై పవన్ చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని పవన్ ఆరోపించారు.

    జగన్‌ది అసమర్థ పాలన: పవన్

    ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు సైతం 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జగన్ అసమర్థ పాలనలో సమస్యలు లేవనెత్తితే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు వాయిదా వేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    ఓట్ల కోసమే జగన్ పథకాలు: పవన్

    వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే జగన్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం. నిధుల మళ్లింపులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు..

    వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

    వారాహీ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి హిట్లర్‌ పరిస్థితిలా ఉంది.’ అని పవన్‌ విమర్శించారు.

    చిరు వీడియోను వైరల్‌ చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌

    భోళాశంకర్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను చిరు ఇమిటేట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి తెగ ఖుషీ అవుతున్న పవన్‌ ఫ్యాన్స్ దీనిని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. పవన్‌, చిరు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆకాశానికెత్తుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, భోళశంకర్‌ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. #ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, … Read more

    పవన్‌ను కలిసిన చంద్రబాబు

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్‌కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో పవన్ మీటింగ్‌ను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత … Read more

    చెప్పులు విడిచి నివాళులు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే, రెబల్ స్టార్ భౌతికకాయంపై పుష్పాంజలి ఘటించే ముందు చెప్పులు విడిచారు. ఈ ఒక్క ఘటనతో తన సంస్కారం ఎంత పెద్దదో నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ మాట్లాడించారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Cheppulu pakka vadhilesi Nivalulu arpincharu respect Sir ?? Thanks @PawanKalyan garu for … Read more

    పవన్ కల్యాణ్ టాప్-10 ఐకానిక్ డైలాగులు

    ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది మనం ఎవరి గురించి చెబుతున్నామో. సినిమా ఏదైనా పవర్‌ఫుల్ పంచ్ డైలాగులతో అభిమానులను ఆకట్టుకునే పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రత్యేకతను ఎంత ప్రస్తావించినా తక్కువే అవుతుంది. చూడప్పా..సిద్ధప్పా లాంటి డైనమిక్ డైలాగులతో అదరగొట్టే పవరేశ్వరుడి బెస్ట్ 10 డైలాగులు తెలుసుకోవాలనుందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. NAK KONCHAM THIKKUNDI KANI DANIKO LEKHA UNDI – GABBARSINGH NUVU NANDA ITHE ENTI NENU BADRI BADRINATH – BADRI … Read more