• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్

    ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే పదిలంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మోదీ మార్చారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

    కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతం: మోదీ

    తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ‘పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మరో పార్టీ చేతిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉంది. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది అని చెప్పుకొచ్చారు.

    తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్ బైయాన్‌పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను బుట్టల్లోకి ఎత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. https://x.com/narendramodi/status/1708383866711642496?s=20

    ప్రధాని టూర్‌కు కేసీఆర్ డుమ్మా

    ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌కు సీఎం కేసీఆర్ మరోసారి ఎగ్గొట్టారు. ఈసారి కూడా ప్రధానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. ప్రధానికి ఎక్కువసార్లు స్వాగతం పలికిన మంత్రిగా తలసాని రికార్డు సృష్టించనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భందా హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మోదీని రావణాసురిడితో పోలుస్తున్న పోస్టర్ల పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ప్రధాని మోదీ పోస్టర్ల కలకలం

    ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ హైదరాబాద్‌లో పలుచోట్ల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో జరిగిన అన్యాయంపై ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ మీద మోదీది సవతితల్లి ప్రేమ అంటూ విమర్శలు పోస్టర్లలో వెలిశాయి. ఈ పోస్టర్లను కావాలనే బీఆర్ఎస్ నేతలు అంటించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ

    తెలంగాణకు నేడు ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై కూడా తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేని కుటుంబ పార్టీలు’ అంటూ విమర్శించారు.

    LIVE: కొలువు దీరిన కొత్త పార్లమెంట్

    కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో లోక్‌ సభ ముందుకు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రానున్నారు. పార్లమెంట్ సమావేశాలను లైవ్‌లో వీక్షించండి.

    కొత్త పార్లమెంట్ ప్రారంభం

    కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రవేశించారు. చివరగా పాత పార్లమెంట్‌లో సభ్యులను కలిసి పార్లమెంట్ ముందు గ్రూప్ ఫొటో దిగారు. 96 ఏళ్ల చరిత్ర ఉన్న పార్లమెంట్ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది. పాత పార్లమెంట్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనం నుంచి ప్రారంభం కానున్నాయి. https://x.com/ANI/status/1704010374264299848?s=20

    జీ20 సదస్సుకు ముస్తాభైన ఢిల్లీ

    జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాభైంది. సభా వేదికతో పాటు ఢిల్లీలోని అన్ని ప్రధాన కూడలిలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు, VVIPలు, వ్యాపార వేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 40వేల మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. సదస్సుకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఢిల్లీ నుంచి సాగే 160 దేశీయ విమాన సర్వీసులు, 207 రైళ్లను ఈనెల 9, … Read more

    వాజ్‌పేయి వర్ధంతి, ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

    నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు. వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందని మోదీ కొనియాడారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu … Read more