• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భాజపాకు ఓటేస్తే భారాసకు వేసినట్లే’

    TG: భాజపాకు రాజీనామా చేయడంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు భారాసకు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

    పదవుల కోసం పార్టీ మారలేదు: రాజగోపాల్

    పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు నమ్మకం పోయింది. బీజేపీ. బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అందుకే కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 100 మంది బీఆర్‌ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నిక గెలిచింది. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు’ అని రాజగోపాల్ పేర్కొన్నారు.

    రేపే అభ్యర్థులను ప్రకటిస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ భరిలో నిలిపేందుకు అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. దాన్ని రేపు అధిష్ఠానం విడుదల చేస్తుంది. ఆయా స్థానాల్లో ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఎంపిక ఆలస్యం అయింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీలో చాలా మంది చేరుతున్నారు. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం నాతో మాట్లాడలేదు’. అని కోమటిరెడ్డి తెలిపారు.

    భాజపాకు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భాజపాకు రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. భారాసకు ప్రత్యామ్నయం కాంగ్రెసే అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ తన అనుచరులతో రాజగోపాల్‌ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ మారడానికి గల కారణాలను వివరించనున్నారు. కాగా ఎల్లుండి మ.11-12 గం.ల మధ్య రాహుల్‌, ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

    కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి.. క్లారిటీ

    TG: కాంగ్రెస్‌ చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌ ఎల్బీ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని కోరినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. భాజపా పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

    కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్

    మునుగోడు ఉపఎన్నికలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి. ఈ దెబ్బతో టీపీసీసీ ప్రెసిడెంట్ అవుతా. అధికారంలోకి వస్తే తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తా అంటూ కాల్‌లో కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు స్పందించాల్సి ఉంది.

    మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్

    ఉస్మానియా వర్సిటీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. హాస్టల్‌లో భోజనం, తాగునీరు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ప్రశ్నలు వేశారు. అన్నం గడ్డలు గడ్డలుగా ఉంటుందని, కూరల్లో గాజుపెంకులు వస్తున్నాయని, ఈ భోజనమే మీ సీఎం మనవడు కూడా తింటాడా అని సబితను ప్రశ్నించారు. వీడియో కోసం వాచ్ఆన్ పై నొక్కండి అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన … Read more