• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

    బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

    ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తెస్తాం: రేవంత్

    ధరణి పోర్టల్‌ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. అలాస్తే తాను నామినేషన్‌ వేయనన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని తెలిపారు. అలంపూర్‌‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.

    రేవంత్‌ తెలంగాణ వ్యతిరేకి: హరీష్‌రావు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ప్రజలు తెలంగాణకు మద్ధతు ఇస్తే రేవంత్ తుపాకీ పట్టుకుని బయటికొచ్చి బెదిరించాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా రేవంత్‌ రెడ్డి పదవిని పట్టుకుని పాకులాడిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారన్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

    రేవంత్ సీటుకు రేటెంత: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌ను రేవంత్‌ అని పిలవడం లేదని రేటెంత.. రేటెంత.. అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నాడన్నాడన్నారు.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు ఏమీ చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

    ఇద్దరే నిందితులని కేటీఆర్‌ ఎలా చెప్తారు: రేవంత్

    TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్ ఎలా చెప్తారని మండిపడ్డారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరే నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కేసును కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. BRS విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని అందుకే ఎగ్జామ్స్ రద్దు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతినోటిఫికేషన్‌ గందరగోళమేనని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Biggboss 6: ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ స్టార్ట్‌

    బిగ్‌బాస్‌లో ఫ‌స్ట్‌వీక్ నామినేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే టాస్క్‌లో ఓడిపోయి ఇనాయా, బాలాదిత్య‌, అభిన‌య‌శ్రీ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఇక మిగ‌తావాళ్ల‌లో ఎవ‌రిని నామినేట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. రేవంత్, ఫైమా మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రుగుతుంది. శ్రీస‌త్య‌, రేవంత్, ఫైమాను ఎక్కువ‌మంది నామినేట్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది.