మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మరింత కిందకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్ 64,449.65 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 237.72 పాయింట్ల నష్టంతో 63,874.93 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,232.95 దగ్గర ప్రారంభమై చివరకు 61.30 పాయింట్లు నష్టపోయి 19,079.60 దగ్గర ముగిసింది. .