• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దు: KCR

  ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తెస్తుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు తీసుకొచ్చానని’. కేసీఆర్‌ తెలిపారు.

  కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

  TG: కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ‌మైన సంస్కృతి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. క‌త్తుల‌తో దాడులు చేసి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిర్మ‌ల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘పదేళ్ల భారాస పాలనలో క‌ర్ఫ్యూ లేదు. మ‌త‌క‌ల్లోలం లేదు. కానీ కాంగ్రెస్ నేతలు క‌త్తులు ప‌ట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్య‌ర్థిని కత్తితో పొడిచారు. దేవుడి ద‌య వ‌ల్ల ప్రాణ‌పాయం త‌ప్పింది. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గ‌మైన సంస్కృతి’ అని మండిపడ్డారు.

  ప్రజల హక్కుల కోసమే BRS పుట్టింది: KCR

  ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్ పెట్టిందని సీఎం కేటీఆర్ అన్నారు. 15 ఏళ్ల పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘రైతులకు మేలు చేసే ఉద్దేశంతో రైతుబంధు తీసుకొచ్చాం. దాన్ని కాంగ్రెస్ దుబారా ఖర్చు అని అంటుంది. ఇప్పటికే చాలా మంది రైతుల రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మరి కొందరికి పూర్తి చేయలేక పోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు. ధరణి తస్తుంది. అప్పుడు అవి రెండూ కూడా ఆగిపోతాయి’ అని … Read more

  ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

  దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 7 నుంచి మొదలుకొని నవంబర్‌ 30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని హెచ్చరిచింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది.

  తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి: రాహుల్

  కొల్లాపూర్‌లో సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుదంటున్నారు. అందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ.15వేలు అందిస్తాం. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

  తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నాం: కేసీఆర్

  తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదని విమర్శించారు. ఆ పార్టీ వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వారికున్న దృక్పథం ఏంటనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

  ఆగమాగం కావద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్

  తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల మాటలు విని ఆగమాగం కాకుండా విచక్షణతో ప్రజలు ఓటు వేయండి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కరెంటులేని పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో తప్పా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి … Read more

  ఆ స్థానాల్లో సా. 4 వరకే పోలింగ్‌: ఈసీ

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 4 వరకే పోలింగ్‌ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

  రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది: డీకే

  డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ జోస్యం చెప్పారు. ‘భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతం.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మీరిప్పుడు రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ అందర్ని కలుపుకుని పోతుంది. తెలంగాణలో మార్పుకోసం దేశమంతా ఎదురుచూస్తోంది.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధాని మోదీ అన్నారు. ఇచ్చిన అన్ని గ్యారెంటీలను డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలువుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

  కేసీఆర్‌కు మద్దతు ఇవ్వండి: ఓవైసీ

  TG: కాంగ్రెస్‌, భాజపాలు అవిభక్త కవలలని MIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో మామ (కేసీఆర్‌)కు మద్దతివ్వాలని అసదుద్దీన్‌ పిలుపునిచ్చారు. ‘నేను బాధ్యత తీసుకుంటాను. ఎన్నికల్లో భారాసకు మద్దతివ్వండి. మామ (కేసీఆర్‌) మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుంది’ అని ఓవైసీ అన్నారు.