• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాలి: మోదీ

    ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని దేశ పౌరులను ప్రధాని కోరారు. రాష్ట్రంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం ఎంతో ప్రత్యేకమన్నారు. ‘కుమావోన్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను తప్పక సందర్శించాల్సిందిగా కోరుతాను. ఎన్నో ఏళ్ల తర్వాత పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

    శివలింగంపై నోట్లు వెదచల్లిన మహిళ

    ఉత్తరాఖండ్‌లోని కేదార్ నాథ్ ఆలయంలో ఓ మహిళ శివలింగంపై కరెన్సీ నోట్లను వెదజల్లడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళ గర్బగుడిలో శివలింగంపై నోట్లు చల్లుతుంటే పూజారులు వేదమంత్రం పఠిస్తున్నారు. ఆ మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్న అక్కడున్న వారు అడ్డుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Disgraceful!?1)A woman was seen showering money on Baba … Read more

    ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు

    ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు పొటెత్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌-కంగ్రా జిల్లాలోని చక్కీ రైల్వే బ్రిడ్జి ఉదయం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు నీట మునిగాయి. నిత్యవసరాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలను చూసేందుకు WATCH ONపై క్లిక్ చేయండి. … Read more