• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

  మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

  ఇవాళ ముదినపల్లే నుంచి వారాహి యాత్ర

  నేడు విజయవాడ- ముదినేపల్లిలో పవన్ కల్యాణ్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లికి పవన్ చేరుకోనున్నారు. ముదినేపల్లిలో బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మాటల దాడి పెంచారు. 32 కేసులున్న జగన్ అవినీతిపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. సమస్యలపై గళం విప్పిన నేతలను జైలుకు పంపించి జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  ఓట్ల కోసమే జగన్ పథకాలు: పవన్

  వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే జగన్ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం. నిధుల మళ్లింపులు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజలు ఒక్కటి కావాలని పవన్ పిలుపునిచ్చారు..

  పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మచిలిపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో కొంత మంది క్రిమినల్స్, అసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో కోరారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచిదికాదు. విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తే పర్యవసనాలు ఉంటాయి. మా సమాచార వ్యవస్థ మాకుంది. ఆయన దగ్గర ఏమైన ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి’ అని సూచించారు.

  వైసీపీకి 15 సీట్లు కూడా రావు: పవన్

  వారాహీ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్‌ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్‌కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి హిట్లర్‌ పరిస్థితిలా ఉంది.’ అని పవన్‌ విమర్శించారు.

  సీఎం జగన్‌ హామీలు మరిచారు: పవన్

  వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇష్టానుసారంగా హామీలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు భారమని తెలిపారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగే బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

  వారాహి యాత్రపై పేర్నినాని విమర్శలు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ యాత్ర కేవలం కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమ్మ, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన టైంలో పవన్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు.

  సభకొస్తారు.. కానీ ఓటెయ్యరు: పవన్

  AP: కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున సభకు వస్తారు కానీ ఓటెందుకు వేయట్లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా టికెట్ కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ఓపిక ఓటు వేసేందుకు ఎందుకు ఉండట్లేదని ఆయన నిలదీశారు. ఏపీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. జనవాణిలో కాకినాడ సమస్యలు వింటుంటే చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని ఆరోపించారు. సినిమా … Read more