రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా ‘ది వారియర్’ తెరకెక్కింది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లింగుస్వామి దర్శకత్వం వహించాడు. కెరీర్‌లో మొదటిసారిగా రామ్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. ఆది పినిశెట్టి ఒక భయంకరమైన విలన్‌గా కనిపించాడు. శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తెలుసుకుందాం
కథేంటంటే..
సత్య (రామ్) ఒక ప్రముఖ డాక్టర్. అతడికి కర్నూల్ సిటీలో పోస్టింగ్ పడుతుంది. కర్నూలులో గురు(ఆది పినిశెట్టి) అనే ఒక రౌడీ అరాచకాలు చేస్తుంటాడు. డాక్టర్‌గా గురుకు ఎదురుతిరగాలనుకున్న సత్యకు అది సాధ్యం కాదు. దీంతో డాక్టర్ వృత్తిని వదిలేసి పోలీస్‌గా మారతాడు. డాక్టర్ పోలీస్ ఎలా అవుతాడు? పోలీస్ అవతారం ఎత్తిన సత్యం గురును ఎలా ఎదుర్కుంటాడు? అనేదే సినిమా కథ
విశ్లేషణ:
డాక్టర్ నుంచి పోలీస్‌గా మారే ప్రక్రియను ఎక్కడా ఓవర్‌గా లేకుండా సింపుల్‌గా తెరకెక్కించారు. ఇలాంటి యాక్షన్ సినిమాల్లో లాజిక్స్ గురించి ఆలోచించకుడా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో దర్శకుడు లింగుస్వామి ఈ విషయంలో జాగ్రత్త వహించాడు. ఈ సినిమాకు ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ పాత్ర బలంగా మారింది. లుక్స్‌తో పాటు డైలాగ్ డెలీవరీతో అదరగొట్టాడు. మొదటిభాగంలో ఎక్కువగా కథలో గురుకే ప్రాధాన్యత ఉంటుంది. రెండో భాగంలో హీరోకు, విలన్‌కు మధ్య అసలైన యుద్ధం మొదలవుతుంది. రామ్, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే సీన్స్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాయి. రామ్ కూడా మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించి అదరగొట్టాడు. ఆ పాత్రలో బాగా ఇమిడిపోయాడు. పాటలు, డ్యాన్స్‌లతో మరోసారి తన ఎనర్జీని చూపించాడు. అయితే ఇలాంటి పోలీస్ యాక్షన్ మూవీస్‌లో కథలో పెద్దగా చెప్పడానికి ఏముండదు. పోలీస్, విలన్ ఇద్దరి మధ్య పోటీ రొటీన్ కథే ఉంటుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో లింగుస్వామి విజయం సాధించాడు.
ఎవరెలా చేశారంటే..
డాక్టర్,పోలీస్ పాత్రలో నటించిన రామ్ పోలీస్‌గా అదరగొట్టాడు. కృతిశెట్టి అందంతో, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. గురు పాత్రలో ఒదిగిపోయాడు. రామ్ తల్లిగా నటించిన నదియా, బ్రహ్మాజీ తదితరులు పాత్ర పరిది మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు:
లింగుస్వామి ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనే చెప్పాలి. కథ, స్క్రీన్‌పై చక్కగా కుదిరాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలకు చేసిన కొరియోగ్రఫీ అదరిపోవడంతో సాంగ్స్‌కి విజిల్స్ పడ్డాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు:
రామ్, ఆది నటన
రెండు పాటలు, బీజీఎం
యాక్షన్ సీన్స్
బలహీనతలు:
రొటీన్ యాక్షన్ డ్రామా
నెమ్మదించిన మొదటిభాగం
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!