• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Weekend OTT Suggestions: వీకెండ్‌లో ఈ సూపర్ హిట్ కొత్త చిత్రాలు అస్సలు మిస్‌కాకండి!

  ఈ వీకెండ్‌ ఎలా ఎంటర్‌టైన్‌ కావాలని ఆలోచిస్తున్నారా? ఓటీటీలో ఏ సినిమా చూడాలని ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన/ రాబోతున్న ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లను YouSay ఈ ప్రత్యేక ఆర్టికల్‌ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. ఇవి కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్‌ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 

  అహం రీబూట్‌

  ప్రముఖ నటుడు సుమంత్‌ (Sumanth) హీరోగా సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘అహం రీబూట్’ (Aham Reboot) చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌లో ఉంది. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ప్రసారం అవుతోంది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఎంతో ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి?’ అన్నది కథ.

  గరుడన్‌

  తమిళ స్టార్‌ కమెడియన్‌ సూరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గరుడన్‌’. దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 31న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జులై 4న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే తమిళ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. భాషతో సంబంధం లేకుండా ఓ మంచి సినిమాను వీకెండ్‌లో ఎంజాయ్‌ చేయాలని భావించే వారికి ‘గరుడన్‌’ తప్పక నచ్చుతుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కథ సాగుతున్నకొద్దీ వీళ్ల మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత గొడవలు మెుదలవుతాయి. ఈ క్రమంలో ఊరిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది ఆసక్తికరం. 

  ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా 

  హాలీవుడ్‌ ఫిల్మ్‌ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే అని చెప్పవచ్చు. ఇటీవల వరల్డ్‌ వైడ్‌గా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా‘ ఓటీటీలోకి వచ్చేసింది. జులై 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు బుక్‌మైషోలోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు. తెలుగుతో పాటు పలు ఇతర ప్రాంతీయ  భాషల్లోనూ ఫ్యూరియోసా అందుబాటులో ఉంది. అయితే రెంటల్ విధానంలో దీనిని అమెజాన్‌ స్ట్రీమింగ్‌లో ఉంచింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది?’ అన్నది కథ.

  శశిమథనం 

  ఈ వీకెండ్‌ మంచి రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను వీక్షించాలని భావించేవారికి ‘శశిమథనం’ సిరీస్‌ మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా సింగ్‌ జంటగా చేశారు. రూపలక్ష్మీ, ప్రదీప్‌ రాపర్తి, కృతిక, అశోక్‌ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై 4 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే.. మదన్‌ (పవన్‌ సిద్ధు), శశి (సోనియా) లవర్స్‌. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మదన్‌ బెట్టింగ్స్‌, పేకాటలకు అలవాటు పడతాడు. ఓ రోజు డబ్బులు పోగొట్టుకోని చిక్కుల్లో పడతాడు. అప్పుల వాళ్ల నుంచి తప్పించుకునేందుకు శశి ఇంటికి వస్తాడు. అక్కడ శశికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ ఆ ఘటనలు ఏంటి? వాటి నుంచి మదన్‌-శశి ఎలా బయటపడ్డారు? అన్నది స్టోరీ. 

  మిర్జాపూర్‌ సీజన్‌ 3

  అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని నుంచి వచ్చిన రెండు సిరీస్‌లు హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఈ వీకెండ్‌ ‘మీర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3) రాబోతోంది. అమెజాన్‌ వేదికగా జులై 5 నుంచి ఈ సిరీస్‌ హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌లో ఉండనుంది. ప్లాట్‌ ఏంటంటే.. మున్నా (దివ్యేంద్రు శర్మ) భాయ్‌ను చంపేసిన తర్వాత  మీర్జాపూర్‌ సింహాసనం  గుడ్డు (అలీ ఫజల్‌) కాళ్ల దగ్గరకు వస్తుంది. అప్పటివరకూ ఖాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసించాడు? గుడ్డును చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానికి లోకల్‌ గ్యాంగ్స్ ఏం చేశాయి? వారిపై గుడ్డు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది సీజన్‌ 3లో చూపించనున్నారు. 

  భజే వాయు వేగం

  మరోవైపు గత వారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ చూడకుంటే ఈ వీకెండ్‌లో తప్పకుండా ప్లాన్‌ చేసుకోండి. కార్తికేయ (Kartikeya) హీరోగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) జూన్‌ 28న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌. ప్లాట్‌ ఏంటంటే.. ‘తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పుడే అనాథగా మారిన వెంకట్‌ను… రాజన్న దత్తత తీసుకుంటాడు. కొడుకు రాజుతో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వెంకట్‌.. విలన్ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేస్తాడు. వారు మోసం చేయడంతో పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది కథ.

  లవ్‌ మౌళి

  నటుడు నవదీప్‌ (Navdeep) తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. రానా ఇందులో అఘోరాగా నటించారు. జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. పర్వాలేదనిపించింది జూన్‌ 27 నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. ‘ఆర్టిస్ట్ అయిన మౌళి.. తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. అతడికి ప్రేమపై నమ్మకం ఉండదు. ఈ క్రమంలో ఓ అఘోరా అతడికి మహిమ గల పెయింటింగ్‌ బ్రష్‌ ఇస్తాడు. దాని సాయంతో తనకు నచ్చిన లక్షణాలున్న యువతిని మౌళి సృష్టించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది కథ.

  సత్యభామ

  కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ’ కూడా గతవారం ఓటీటీలోకి వచ్చింది. జూన్‌ 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కాజ‌ల్‌కు జంట‌గా న‌వీన్ చంద్ర (Naveen Chandra) న‌టించ‌గా.. ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj), హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ (Harsha Vardhan), నేహా ప‌ఠాన్‌, పాయ‌ల్ రాధా కృష్ణ (Payal Radhakrishna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఏసీపీ సత్యభామ.. షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఆమెను హసినా అనే బాధితురాలు కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెప్పుకొని వాపోతుంది. ఈ క్రమంలో హసినా.. భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యభామ.. నేరస్థుడిని ఎలా పట్టుకుంది? దర్యాప్తులో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది కథ.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv