• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT releases this week: వీకెండ్‌లో మీ ఆనందాన్ని రెట్టింపు చేసే ఓటీటీ చిత్రాలు..!

    వీకెండ్‌ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వీకెండ్‌ కోసం మూవీ లవర్స్‌ వీక్‌ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు, సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్‌ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    సత్యం సుందరం (Sathyam Sundaram)

    ఈ వీకెండ్‌ ఓటీటీలోకి రాబోతున్న సూపర్‌ హిట్‌ చిత్రం ‘సత్యం సుందరం’. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. తమళ స్టార్ జంట సూర్య, జ్యోతిక ఈ మూవీని నిర్మించారు. అక్టోబర్‌ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ఆస్తి తగాదాల కారణంగా సత్యం (అరవిందస్వామి) పుట్టి పెరిగిన ఇల్లు, ఊరికి దూరమవుతాడు. 30 ఏళ్ల తర్వాత ఓ పెళ్లి కోసం వచ్చిన అతడికి మండపంలో ఓ బంధువు (కార్తీ) పరిచయం అవుతాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. వీరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? అన్నది స్టోరీ.

    ఐందం వేదం (Aindham Vedham)

    దర్శకుడు నాగరాజన్ రూపొందించిన తాజా థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఐంధమ్ వేదమ్’ (ఐదో వేదం). అక్టోబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ముందుకురానుంది. పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన ఓ ప్రాచీన గ్రంథం చుట్టూ ఈ సిరీస్‌ తిరగనుంది.

    హిట్లర్‌ (Hitler)

    విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘హిట్ల‌ర్‘. అక్టోబ‌ర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ వీక్షించవచ్చు. ఇందులో విజయ్‌కు జోడీగా రియా సుమన్‌ నటించగా మణిరత్నం శిష్యుడు ధన దర్శకత్వం వహించారు. ప్లాట్ ఏంటంటే ‘మినిస్ట‌ర్ మైఖేల్ (చ‌ర‌ణ్ రాజ్‌) మ‌నుషులు ఒక్కొక్క‌రిగా హ‌త్య‌కు గుర‌వుతుంటారు. అతడి కోట్ల రూపాయ‌ల బ్లాక్ మ‌నీని ఓ వ్య‌క్తి ఎత్తుకుపోతాడు. రంగంలోకి దిగిన పోలీసు అధికారి (గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌) దీనంతటికీ కారణం సెల్వ (విజయ్ అంటోని) అని కనిపెడతాడు. ఓ ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన సెల్వ మినిస్ట‌ర్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అతడి లవ్‌స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ. 

    దో పత్తి (Do Patti)

    బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘దో పత్తి‘. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె తొలిసారి ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శశాంక చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. కవలలైన అక్కా చెల్లెళ్ల గురించిన రహస్యాలను వెలికితీసే పోలీసు అధికారి పాత్రలో కనిపించనుంది ప్రముఖ నటి కాజోల్‌ నటించింది. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’ పతాకంపై కృతి నిర్మిస్తున్న తొలి చిత్రమిది. షహీర్‌ షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబరు 25న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల కాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు.

    లిటిల్‌ హార్ట్స్‌ (Little Hearts)

    షేన్‌ నిగమ్‌, మహిమా నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌‘. అక్టోబర్‌ 24 నుంచి ఈ మలయాళ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘సిబి (షేన్ నిగమ్), సోష (మహిమా నంబియార్) చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. పెద్ద వాళ్లకు చెబితే అంగీకరించరేమోనని దాచి దాడిపెడతారు. ఒంటరిగా ఉండే సిబి తండ్రి బేబీ మరో మహిళను ప్రేమిస్తాడు. దీనిని ఆ మహిళ కూతుర్లు వ్యతిరేకిస్తారు. తన తండ్రి ప్రేమ వ్యవహారం సిబికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ పరిస్థితులును సిబి ఎలా చక్కదిద్దాడు? తన తండ్రితో పాటు తన ప్రేమను గెలిపించుకున్నాడు?’ అన్నది స్టోరీ. 

    మై సాసీ గర్ల్ (My Sassy Girl)

    ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కొరియన్ డ్రామా వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘ఓ స్కాలర్‌, యువరాణి మధ్య పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారతారు. అది ప్రేమకు ఎలా దారితీసింది? వారి ప్రేమకు రాజకుంటుంబం అంగీకరించిందా? లేదా?’ అన్నది స్టోరీ.

    కలి (Kali)

    గతవారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ చూడకుంటే ఈ వీకెండ్‌లో ప్లాన్‌ చేయండి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కలి’ (Kali Movie OTT Release) చిత్రం అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్‌ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న రిలీజై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ప్లాట్‌ ఏంటంటే ‘శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. అయితే శివరామ్‌ మంచి తనాన్ని క్యాష్‌ చేసుకొని సొంతవారే అతడి ఆస్తిని కొట్టేస్తారు. దీంతో ఆత్మహత్యకు యత్నిస్తున్న శివరామ్‌ను కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్‌ అగస్త్య) అడ్డుకుంటాడు. అతడి రాకతో శివరామ్‌ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి?’ అన్నది స్టోరీ.

    1000 బేబీస్‌ (1000 Babies)

    గతవారం ఓటీటీలోకి వచ్చిన ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ ‘1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్‌ 18న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్‌, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్‌ దర్శకత్వం వహించారు. ప్లాట్ ఏంటంటే ‘అడవి మధ్యలోని ఓ ఇంట్లో సారా జోసేఫ్ అనే ముసలావిడి ఒంటరిగా జీవిస్తుంటుంది. గోడలపై పిచ్చిరాతలు రాసుకుంటూ ఉంటుంది. అయితే చనిపోయే ముందు ఓ పోలీసు, లాయర్‌కు ఒక లెటర్ ఇస్తుంది. అది చూసిన వారిద్దరు షాకవుతారు. ఇంతకీ ఆ లెటర్‌లో ఏముంది? అందులో సారా ఏం రాసింది? అడవిలో జరిగిన వరుస హత్యలకు కారణం ఎవరు? ఆ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు?’ అన్నది స్టోరీ.

    స్నేక్ అండ్‌ ల్యాడర్స్‌ (Snake And Ladders)

    అమెజాన్ ప్రైమ్‌లో మరో థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ గత వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘స్నేక్ అండ్ ల్యాడర్స్’ అనే సిరీస్‌ ఈ నెల 18వ తేదీ నుంచి తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. నవీన్ చంద్ర, ముత్తుకుమార్, నందా, మనోజ్ భారతీరాజా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. భరత్, మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా ఆల్కెమిస్ ఎపిసోడ్స్‌ వారిగా దర్శకత్వం వహించారు. నలుగురు డేరింగ్ పిల్లల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్లాట్‌ ఏంటంటే ‘ఓ ప్రమాదాన్ని దాచి పెట్టడానికి నలుగురు పిల్లలు చేసిన ప్రయత్నం మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పోలీసులు, దొంగలు వారి వెంట పడతారు. వాళ్ల నుంచి ఈ నలుగురు పిల్లలు ఎలా తప్పించుకుంటారు? చివరికి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది స్టోరీ.

    క్రైమ్‌ రీల్‌ (Crime Reel)

    బిగ్‌బాస్ సీజ‌న్ 2 బ్యూటీ సంజ‌న అన్నే హీరోయిన్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘క్రైమ్‌ రీల్‌‘.  భ‌ర‌త్‌, సిరి చౌద‌రితోపాటు జ‌బ‌ర్ధ‌స్థ్ అభి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అక్టోబర్‌ 13 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఒక అమాయకురాలైన అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేయడం మెుదలుపెడుతుంది. అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ ఫాలో అవ్వడం, వాటిలో పాల్గొనడం చేస్తుంది. దీంతో హీరోయిన్‌ కావాలన్న కల ఆమెలో మెుదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోషల్‌ మీడియా రీల్స్‌ వల్ల ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?’ అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv