• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Great Indian Festival Diwali Sale 2024 : లావా అగ్ని3 స్మార్ట్‌ ఫొన్‌పై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే?

    దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ మరోసారి ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ 2024 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కూడా అదనపు 10% తగ్గింపును పొందవచ్చు.

    ఈ క్రమంలో ఇటీవల లాంచ్‌ అయిన లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ సేల్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ధరకు అందిస్తున్నారు. దీపావళి సేల్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలు చేయడానికి మంచి అవకాశాన్ని అందిస్తోంది.

    లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు:

    1. అమోలెడ్ డిస్‌ప్లే

    లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా, వెనుకవైపు 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్‌ప్లే కూడా ఉంది, ఇది స్పెషల్ అట్రాక్షన్‌గా  నిలుస్తుంది.

    2. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్

    ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనంగా, 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందిస్తామని లావా సంస్థ హామీ ఇచ్చింది.

    3. ట్రిపుల్ కెమెరా సెటప్

    లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా OIS (Optical Image Stabilization) సపోర్ట్‌తో ఉంటుంది. అలాగే, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16MP కెమెరా ఉంది.

    4. 66W ఫాస్ట్ ఛార్జింగ్

    ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. ఛార్జర్‌తో ఫోన్ ధర ₹22,999 ఉంటే, ఛార్జర్ లేకుండా ₹20,999కి పొందవచ్చు.

    5. యాక్షన్ కీ

    లావా అగ్ని 3 వెనుక భాగంలో చిన్న డిస్‌ప్లేతో పాటు, ఐఫోన్ తరహాలో యాక్షన్ కీ కూడా ఉంటుంది. ఈ చిన్న డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్లు, స్టాప్‌వాచ్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు.

    దీపావళి సేల్‌లో లావా అగ్ని 3 5G కొనుగోలు

    ఈ దీపావళి సేల్‌లో లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అదిరిపోయే ఆఫర్‌ ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్‌లతో కూడిన ప్రత్యేక ధరలకు పొందండి.

    లావా అగ్ని 3 ఆఫర్లు

    లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

    1. 8GB RAM + 128GB స్టోరేజ్:
      మునుపటి ధర: ₹25,999
      తగ్గింపు ధర:  ₹22,999, ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా అదనంగా 10% తగ్గింపు పొందవచ్చు.
    2. 8GB RAM + 256GB స్టోరేజ్:
      మునుపటి ధర: ₹27,999
      తగ్గింపు ధర: ₹24,999, బ్యాంకు కార్డుల ద్వారా అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv