• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • War 2: ‘వార్‌ 2’ షూటింగ్ నుంచి మళ్లీ తారక్‌ ఫొటో లీక్! 

    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. ‘RRR’, ‘దేవర‘ లాంటి బ్లాక్‌ బాస్టర్స్‌ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తారక్‌ సైతం షూటింగ్‌ జాయిన్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్‌కు సంబంధించిన ఫొటో లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. 

    స్టైలిష్‌ లుక్‌లో అదరహో

    ప్రస్తుతం తారక్‌ ‘వార్‌ 2’ (War 2) షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన పాత్రకు సంబంధించిన సీన్స్‌లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్‌ స్పాట్‌ నుంచి తారక్ ఫొటో ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో తారక్‌ స్టైలిష్‌ లుక్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. లీకైన ఫొటోలో తారక్‌ సైడ్‌ లుక్‌ కనిపించింది. టీషర్ట్‌ మీద మిలటరీ తరహా గళ్ల చొక్క వేసి కనిపించాడు. అంతేకాదు షూటింగ్‌ కోసం వినియోగిస్తున్న గన్స్‌ను కూడా లీకైన ఫొటోల్లో గమనించవచ్చు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారింది. తారక్‌ లుక్‌ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే గతంలోనూ ‘వార్‌ 2’ షూటింగ్‌కి సంబంధించి తారక్ ఫొటోలు లీకయ్యాయి. 

    హాలీవుడ్‌ రేంజ్‌ ఎంట్రీ

    ‘వార్‌ 2’లో తారక్ ఇంట్రడక్షన్‌ సీన్‌కు సంబంధించి బీ టౌన్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైరేట్‌ తరహా థీమ్‌తో తారక్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ సీన్‌లో యాక్షన్‌ డోస్‌ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. తారక్‌ చేసే ఫైట్స్ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియన్స్‌ తప్పకుండా సర్‌ప్రైజ్‌ అవుతారని అంచనా వేస్తున్నాయి. అలాగే హృతిక్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు కూడా గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని సమాచారం. యశ్‌రాజ్‌ సంస్థ ఇప్పటివరకూ నిర్మించిన స్పై యూనివర్స్‌లో ‘వార్‌ 2’ స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఇందులో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. 

    షారుక్‌ స్పెషల్‌ రోల్‌?

    ‘వార్ 2’ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ వార్త కూడా బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) ఈ సినిమాలో స్పెషల్ క్యామియో ఇవ్వనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్‌ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి షూట్‌ కూడా మెుదలైనట్లు చెబుతున్నారు. అంతేకాదు తారక్‌-షారుక్‌ మధ్య ఫేస్‌ టు ఫేస్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. హిందీలో ఫస్ట్ ఫిల్మ్‌తోనే హృతిక్‌, షారుక్‌ వంటి స్టాన్‌ నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్ తారక్‌ రావడం నిజంగా గొప్ప విషయమే. 

    ‘NTR 31’ లోడింగ్‌!

    ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv