‘డాన్స్ ఇండియా డాన్స్’ ఇప్పుడు తెలుగులో; జూన్ 23 నుండి
ఆడిషన్స్ నిర్వహించనున్న ‘జీ తెలుగు’
హైదరాబాద్, 18th జూన్, 2022: ‘జీ తెలుగు’ తమ వీక్షకులకు నాన్-స్టాప్ వినోదాన్ని పంచేందుకు గాను, ప్రతిభను గుర్తించి మరియు దాన్ని ప్రోత్సహించేందుకు గాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన ‘జీ నెట్వర్క్’ యొక్క ప్రీమియం రియాలిటీ షో — డాన్స్ ఇండియా డాన్స్ — ఇప్పుడు తెలుగులో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ షో ఇప్పటికే పలు భాషలలో నిర్వహింపబడి అద్భుతమైన విజయాన్ని అందుకుని, చిత్రపరిశ్రమకు మంచి టాలెంట్ ను అందించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ అవకాశాన్ని తెలుగు ప్రేక్షుకులకు కూడా కల్పించేందుకు, ‘జీ తెలుగు’ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన డాన్సర్స్ ని వెతికిపట్టుకునేందుకు ఆడిషన్స్ నిర్వహించబోతుంది.
ఐతే, ‘డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు’ కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. వివిధ సాంస్కృతిక నేపథ్యం మరియు జీవనశైలి కలిగిన డాన్సర్స్ ను జూన్ 23 నుండి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూల్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి వెతికిపట్టుకోనుంది ‘జీ తెలుగు’. డాన్స్ మీద ఆసక్తివున్నఆరు నుండి అరవై సంవత్సరాల వయస్సు కలిగిన వారెవరైనా ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఈ ఆడిషన్స్ జూన్ 23న వరంగల్ మరియు ఖమ్మంలో, జూన్ 24న కర్నూల్ మరియు విజయవాడలో, జూన్ 26న తిరుపతి మరియు వైజాగ్ లో జరగనున్నాయి. ఆదేవిధంగా, ఆశావహులు డిజిటల్ ఆడిషన్స్ లో కూడా పాల్గొనవచ్చు. మీ యొక్క డాన్స్ వీడియో షూట్ చేసి 9154984009 నెం.కి వాట్సాప్ చేయండి లేదా did.zeetelugu@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీరు ‘didtelugu.zee5.com కు లాగాన్ అవ్వడంద్వారా కూడా మీ వీడియోలను పంపవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం