సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రతి డైలాగ్ కొత్తగా అనిపించింది. ఫన్ అండ్ ఎంటర్‌టైన్ చేసేలా హీరోహీరోయిన్ మధ్య సాగిన సన్నివేశాలు సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇంతకి ‘అట్లుంటది మనతోని.. ఏమనుకున్నవ్’ అంటూ డీజే టిల్లు చెప్పిన టాప్ డైలాగులు ఏంటో మీరూ చూసేయండి.
1.
డీజే టిల్లు: అరే ఏం చేస్తవ్ డాడీ పైసలన్నీ..మొలతాడుకి కట్టుకొని బొందలగడ్డకు పట్టకపోతవ నాకర్థం గాదు
డాడీ: మరి ముట్టుకోకురా నా పైసల్. నీ పైసల్‌తోనే చేసుకో ఇవన్నీ
2.
రిలేటివ్: అరేయ్ టిల్లు.. మటన్ మంచిగ ఉడకలేదురా
డిజే టిల్లు: తినకయితే పో
3.
టిల్లు: అంటే నేను ఒక్క నైట్‌లో ఒక్క సర్‌ప్రైజే హ్యాండిల్ చేయగల్గుత రాధిక. ఇట్ల మల్టీపుల్ అంటే నాతోనిగాదు. అసలే డెలికేట్ మైండ్ నాది
4.
అమ్మ: అరేయ్ టిల్లు ఎందిర అమ్మాయింకా రాలేదు. ఆయనెళ్లి పడుకుంటానంటున్నాడు
టిల్లు: పడుకొని ఏం చేస్తడమ్మ.. గొప్పగొప్ప కలలేమైనా కంటడ..లేదుగద.. ఉండమను
5.
టిల్లు: ఆ గునపం తీసుకురా..
రాధిక : గున..వాట్
టిల్లు: దట్ లాంగ్ ఐరన్ రాడ్..దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ మై..ప్లీజ్ గెట్ ఇట్
6.
మార్కస్: అసల్ ఏడున్నవ్ అన్న.. ఏం చేస్తున్నవ్
టిల్లు: ఏవంటే ఏం చెప్పాలిరా మార్కస్..ఒక ల్యాండ్ ఉన్నది. అది మన సొంతం, మన పర్సనల్ అనుకున్న నేను. కాకుంటే ఊర్లో ఉన్నొళ్లందరీ పేరు మీదున్నది అది. ఏం చేస్తం అదేదో సెటిల్‌మెంట్ ఉంటే..అదేదో హోటల్‌కి పోతున్న నేను
మార్కస్: హోటలా.. మటన్ బిర్యాని పెడతరా
టిల్లు: ఆ పెడతరు..నోట్లో పెద్ద ముద్ద
7.
రాధిక: ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు
టిల్లు: నువ్వు నిజంగనే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నవా రాధిక
8.
టిల్లు: అరేయ్ టౌఫిక్.. ఎందుకుర అప్పిచ్చినోనిలెక్క అన్నిసార్లు ఫోన్ చేస్తున్నవ్ నాకు
9.
టిల్లు: హేయ్ డాక్టర్ బిత్తిరి చూపులు చూడకు..టాలెంట్ జూపెట్టు
10.
టిల్లు: అట్లుంటది మనతోని ముచ్చట
11.
టిల్లు : వాట్స్ అప్ బేబీ
రాధిక: ఎందుకింత లేటయింది
టిల్లు: ఎందుకంటే మధ్యలొచ్చేటప్పుడు పోలీసోడు పట్టుకున్నడు. ఓవర్ స్పీడింగ్. 120 స్పీడులో వస్తున్న నేను. మస్త్ రూల్స్ మాట్లాడి ఐదొందల రూపాయలడిగిండు. వెయ్యి రూపాయలిచ్చిన నేను. గెస్ వై ..అన్న నేను వచ్చేటప్పుడు గూడ అదే స్పీడులొస్తని.. అట్లుంటది మనతోని
12.
టిల్లు : అరే..ఇడ పెద్ద ఇలాఖత్‌మాఫియా నడుస్తునది రా..వానికి తెలుసన్న సంగతి నీకు తెల్వదు..నువ్వున్న సంగతి నాకు తెల్వదు..నేనున్న సంగతి నీకు తెల్వదు.ఇడ అన్ని తెలిసిన క్యాండెట్ ఎవరైనా ఉన్నరంటే.. అది మన అస్కార్ విన్నర్ రాధిక అక్క. అక్కని ఆపకుంటే మాత్రం మనమందరం దేవునుకి ఆప్తులమైపోతం రా
13.
టిల్లు: రాధిక, కాదు ఇట్ల నా బర్త్ డే ఉందని చెప్పి నా మీద ఏమన్న ఫ్రాంక్‌లాగా ఏమన్న ప్లాన్ చేస్తున్నవ నువ్వు.. అట్లంటిదేమైనా ఉంటే చెప్పేసేయ్.. ఎందుకంటే నా మీద ఎవడైన చిన్న జోక్ ఏస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ నాది.. ఇట్లంటిదంటే చాలా కష్టమైపోతది.. ప్లీజ్
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్