• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేశ్‌బాబు టాప్-5 న్యూ సాంగ్స్

    సూపర్ స్టార్ మహేశ్‌బాబు మూవీ అంటే యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాదు.. ఆకట్టుకునే పాటలు కూడ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అందుకే అతడి ఫస్ట్ మూవీ రాజకుమారుడు నుంచి త్వరలో రిలీజ్‌కానున్న సర్కారు వారి పాట చిత్రాల వరకు ప్రతి మూవీలో సాంగ్స్ హైలెట్‌గా నిలిచాయనడంలో సందేహం లేదు. అందులోనూ ఇటీవల రిలీజ్‌అయిన కొత్త సినిమాల్లో సాంగ్స్ యువతను తెగ ఆకట్టుకున్నాయి. ఇంతకి ఈ సూపర్ స్టార్ మూవీలో ప్రేక్షకుల మనసు దోచిన టాప్ 5 న్యూ సాంగ్స్ ఏంటో తెలుసా..? తెలియకుంటే మీరూ ఓ లుక్కేయండి.

    1.   కళావతి(సర్కారు వారి పాట)

    మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 12న రిలీజ్‌కానుంది. పరశురామ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ మూవీ నుంచి వచ్చిన క్రేజీ అప్డేట్‌లో కళావతి సాంగ్ ఒకటి. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్‌గా నిలిచింది. కమాన్ కమాన్ కళావతి అంటూ సిద్ధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్‌. అలాగే అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే 125 ఫ్లస్ మిలియన్ల వ్యూస్ పొందింది.

    2.పెన్నీ(సర్కారు వారి పాట)

    సర్కారు వారి పాట నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ సాంగ్ ఇది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించగా నకాష్ అజీజ్ పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. ఈ పాటలో మ‌హేశ్ బాబు కూతురు సితార వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొద‌టిసారి తండ్రి-కూతూరు మ్యూజిక్ వీడియోలో క‌నిపించ‌నుండ‌టంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సాంగ్ ఇప్పటికే 25 మిలియన్ల వ్యూస్ సాధించింది.

    3.డాంగ్ డాంగ్(సరిలేరు నీకెవ్వరు)

    ఆజ్ రాత్ మేరీ ఘర్ మే పార్టీ హే అంటూ ఓ గెస్ట్ రోల్‌లో తమన్నా వేసిన స్టెప్పులు కుర్రకారును ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా నకాశ్ అజీజ్, లవిత లోబో సాంగ్స్ పాడారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ సూపర్బ్‌గా నిలిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ మూవీ రిలీజ్‌కి ముందు ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 86 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.

    4.వచ్చాడయో సామి(భరత్ అనే నేను)

    ముసలి తాత ముడత ముఖం.. మురిసి పోయేనే అంటూ ప్రారంభమైన ఈ పాట మూవీకే హైలెట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా కైలాశ్ కుమార్, దివ్య కుమార్ ఈ పాటను పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సమకూర్చారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో మహేశ్‌బాబు ఓ పవర్ ఫుల్ సీఎంగా  ఆకట్టుకున్నాడు.

    5.పదర పదర(మహర్షి)

    వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. శ్రీమణి అందించిన లిరిక్స్ యువతను ఆలోచింపజేసేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా శంకర్ మహదేవన్ పాడారు. యువత వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ఈ సాంగ్ ప్రేరేపించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీలో మహేశ్ బాబు, అల్లరి నరేశ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv