• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లవ్ స్టొరీ’ మూవీ రివ్యూ

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!

    స్టోరీ

    ఒక జుంబా ట్రైనింగ్ సెంటర్ నడుపుకునే రేవంత్ (నాగచైతన్య), మౌనికను (సాయిపల్లవి) కలుస్తాడు. నెమ్మదిగా వీరిద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత ప్రేమించుకున్న వీరు వీరి సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకునివెళ్ళాలి అని అనుకుంటారు. అయితే కుల వివక్ష వీరిద్దరి ప్రేమ కథకు అడ్డుపడుతుంది. ఇక అవతల వారికి ఉండే కులపిచ్చి వల్ల వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా ఎఫెక్ట్ అయింది? వీరే ప్రేమ పరిస్థితి చివరికి ఏమైంది అన్నదే మిగిలిన సినిమా.

    పాజిటివ్స్

    నాగచైతన్య సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. వీరిద్దరూ కథకి పూర్తిస్థాయి సహకారాన్ని అందించారు. వీరిద్దరికీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి.

    ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంత అద్భుతంగా వచ్చాయి. మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే భారీ హిట్ అయింది… అయితే స్క్రీన్ పైన కూడా అంతే అందంగా పాటలను చిత్రీకరించారు. 

    ఈ సినిమాలోని కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్లు బాగా వచ్చాయి. రొమాంటిక్ కామెడీ కాకుండా ఒక సామాజిక అంశంపై తెరకెక్కిన ఈ చిత్రంలో ఇలాంటివి ఎంతో అవసరం.

    ఇంకా సమాజంలో నెలకొన్న వివక్ష, అసమానత్వం పైన తీసిన సన్నివేశాలు కూడా బాగా చూపించారు. ఈ సీన్లు వరకు దర్శకుడి ప్రతిభ అర్థమవుతుంది.

    నెగటివ్స్

    సినిమా మొదటి రెండు గంటలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. అసలైన సబ్జెక్ట్ లోకి ఎంటర్ కావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకుంటాడు. ఇదే ఈ చిత్రాన్ని బాగా దెబ్బతీసింది.

    ఇక చివరి భాగంలో, క్లైమాక్స్ లో ఒక సామాజిక అంశాన్ని గురించి చర్చించాలి కాబట్టి అందుకు తగిన సమయం సరిపోలేదు. కాబట్టి క్లైమాక్స్ పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది. ఇది కొద్దిగా నచ్చకపోవచ్చు.

    విశ్లేషణ

    మొత్తానికి ‘లవ్ స్టోరీ’ ఒక రొటీన్ ప్రేమకథలా ఉన్నప్పటికీ అసలు ప్రేమ అనేది ఎన్ని రకాల అసమానతల వల్ల ప్రభావితం అవుతుందనే విషయాన్ని శేఖర్ కమ్ముల చక్కగా చూపించారు. సాయి పల్లవి, నాగచైతన్య స్క్రీన్ పైన అదరగొట్టేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో బాగుంద అయితే ఎడిటింగ్ ఎంతో మెరుగుపడవలసి  ఉంది. అసలైన అంశంపై ఎక్కువ సమయం వెచ్చించి ఉంటే చిత్రం మరింత బాగుండేది. అయితే నటీనటుల పెర్ఫార్మెన్స్, ఎంటర్టైనింగ్ సీన్లు, అద్భుతమైన పాటలతో ఈ చిత్రం థియేటర్ల వద్ద ఎక్కువ రోజులు నిలిచే అవకాశం ఉంది.

    రేటింగ్: 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv