• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 36th Hyderabad National Book Fair: ఏం కొనాలో అర్థం కావడం లేదా? తెలుగులో టాప్ 20 బుక్స్ మీకోసం!

  దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన (36th Hyderabad National Book Fair) మరోసారి పుస్తక ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపటి (09 ఫిబ్రవరి) నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు ఈ ‘36వ జాతీయ పుస్తక ప్రదర్శన’ జరగనుంది. నగరంలోని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో మెుత్తం 365 స్టాల్స్‌ ఉండబోతున్నాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి 184 స్టాల్స్‌ ఉండగా.. ఆంగ్ల సాహిత్యానికి 144 స్టాల్స్‌, పిల్లల కోసం 18 స్టాల్స్‌, ప్రభుత్వం సమాచార స్టాల్స్‌ 7, మీడియా రంగ సంస్థలకు సంబంధించి 15 స్టాల్స్‌ ఉంటాయి. వీటితో పాటు ప్రముఖ సాహితివేత్తల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే పుస్తకాలు చదవాలని చాలామందికి ఉన్నా.. ఏం చదవాలో తెలియక కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. అటువంటి వారి కోసం తెలుగు సాహిత్యంలోని టాప్‌-20 బుక్స్‌ (Top 20 Telugu Books) మీ ముందుకు తెస్తున్నాం. ‌అవేంటో ఇప్పుడు చూద్దాం. 

  తెలుగులోని 20 అత్యుత్తమ పుస్తకాలు

  హంపీ నుంచి హరప్పా దాకా (Hampi Nunchi Harappa Daaka)

  తెలుగు భాషకు (36th Hyderabad National Book Fair) చెప్పలేనంత సేవ చేసిన ‘తిరుమల రామచంద్రగారి’ ఆత్మకథ ఆధారంగా ఈ పుస్తకం రూపొందింది. గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమైనదిగా ఈ పుస్తకం గుర్తింపు పొందింది. తెలుగు భాషపై అనురక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.

  చెంఘీజ్ ఖాన్ (Genghis Khan)

  హిస్టరీపై పట్టు ఉన్న వారికి చెంఘీజ్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న తండా నాయకుని కొడుకుగా పుట్టిన అతడు జగజ్జేతగా మారిన వైనాన్నీ ఈ పుస్తకం అద్దం పడుతుంది. చెంఘీజ్‌ ఖాన్‌ జీవితాన్ని.. మనస్సును తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి రచించిన ఈ నవల చదవాల్సిందే. 

  వేదములు (Vedamulu)

  హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా వాటిని ‘వేదములు’ అనే పుస్తకం పటాపంచలు చేస్తుంది.  అసలు వేదములలో ఏముంది? వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ సంక్షిప్తంగా, సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం ‘వేదములు’ చదివి తీరాల్సిందే.

  సాక్షి (Sakshi)

  సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్లు ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా.. చెంపలు చెళ్లుమనిపించే చమక్కులు కురిపించాలన్నా సాక్షి పుస్తకం చదవాల్సిందే. పానుగంటి లక్ష్మీనరసింహరావు రచించిన ‘సాక్షి’ పుస్తకంలోని వ్యాసాలు నేటి సమాజాన్ని అద్దం పడుతూ మళ్లీ మళ్లీ చదివేలా చేస్తాయి.

  తత్వవేత్తలు (Thathvavethalu)

  ఈ ప్రపంచంలో (36th Hyderabad National Book Fair) ఎంతో మంది తత్వవేత్తలు ఉన్నారు. వారి గురించి వచ్చిన ఆత్మకథలు చదువుకుంటూ పోతే సమయం సరిపోదు. అటువంటి వారికి త్రిపురనేని గోపీచంద్ రచించిన ‘తత్వవేత్తలు’ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆది శంకరుల నుంచి కృష్ణమూర్తి వరకూ.. కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య మేధావుల గురించి కూడా ఈ పుస్తకంలో సమాచారం ఉంది. 

  ఒక యోగి ఆత్మకథ (Oka Yogi Atma Katha)

  ఆధ్యాత్మిక భావనలు కలిగిన వారికి ఈ పుస్తకం ఎంతగానో నచ్చుతుంది. మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి వంటి యోగిపుంగవుల గురించి.. మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి ఈ పుస్తకంలో మనకు తెలియజేస్తుంది. 

  కథాశిల్పం (Katha Silpam)

  కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు ‘కథా శిల్పం’ పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతులను ఈ పుస్తకం తెలియజేస్తుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఈ పుస్తకాన్ని రాశారు. 

  విజయానికి అయిదు మెట్లు (Vijayaniki Idu Metlu)

  తెలుగులో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్తకం ఇది. యండమూరి వీరేంధ్రనాథ్‌ రచించారు. ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణులు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే.

  అమృతం కురిసిన రాత్రి (Amrutam Kurisina Raatri)

  తెలుగులోని (36th Hyderabad National Book Fair) సుప్రసిద్ధ రచనల్లో ‘అమృతం కురిసిన రాత్రి’ ఒకటి. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రచించారు. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. ఈ పుస్తకం 1971లో ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది\

  వెన్నెల్లో ఆడపిల్ల (Vennello Aadapilla)

  ఒక చదరంగం క్రీడాకారుడికీ, ఆక్స్‌ఫర్డ్ విద్యార్థినికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ నవల వృత్తాంతం. ఇందులో కథానాయిక, కథానాయకుడితో కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమె ఫోన్ నంబరును కనుక్కోవాలని, ఆమెను చూడాలని ప్రయత్నిస్తుంటాడు. మరి ఆ అమ్మాయిని కనిపెట్టాడా? లేదా? అన్నది కథ. దీనిని యండమూరి వీరేంద్రనాథ్‌ రచించారు. 

  మైదానం (Maidanam)

  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి.. ముస్లిం అయిన అమీర్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. అప్పటివరకూ ఎన్నో వైభోగాలు అనుభవించిన ఆమె పెళ్లి తర్వాత అనేక కష్టాలు పడుతుంది. అయినప్పటికీ భర్తనే ఆరాదిస్తుంటుంది. అయితే అమీర్‌.. రాజేశ్వరినీ కాదని పరాయి స్త్రీ వ్యామోహంలో పడతాడు. మరి రాజేశ్వరి ఏం చేసిందన్నది స్టోరీ. దీనిని చలం రచించారు.

  అమరావతి కథలు (Amaravati Kathalu)

  అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన 100 కథల సమాహారమే ఈ అమరావతి కథల సంపుటి. ఒక పేజీకి మించని కథల్లో రచయిత ఎన్నో విషయాలను తెలియజేశారు. తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించాడు. ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులంగా రాశారు. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దీనిని సత్యం శంకరమంచి రచించారు. 

  చిల్లర దేవుళ్లు (Chilla Devullu)

  తెలంగాణాలోని (36th Hyderabad National Book Fair) ఓ చిన్న పల్లెటూరుకు సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువుకు కోసం వస్తాడు. ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుకుంటాడు. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే వారు హిందువులూ కాలేక, ముస్లిములుగానూ ఇమడలేక వారుపడే బాధలను నవల ప్రతిబింబిస్తుంటుంది.  దాశరథి రంగాచార్య రచనల్లో ఈ పుస్తకం ఎంతో పేరుగాంచింది. 

  వేయి పడగలు (Veyi Padagalu)

  ఆధునిక మ హాభారతంగా గౌరవింపబడే ఈ పుస్తకం ముఖ్యంగా ధర్మారావు అనే వ్యక్తి జీవిత నైపథ్యంగా సాగుతుంది. తండ్రి దాన ధర్మాల వాల్ల ఆస్థిని కోల్పోయినా.. ధర్మారావు తన నాన్న నేర్పిన ధర్మ మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అవసరమైన చోట తన జ్ఞాన సంపద పంచుతుంటాడు. ఒక దేవధాసి రాకతో కథ మలుపు తిరుగుతుంది.

  పాకుడు రాళ్లు (Pakudu Rallu)

  రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్లు పుస్తకం కూడా మీకు తప్పనసరిగా నచ్చుంది. కథలోకి వెళ్తే మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయకి పాత్ర ఇస్తానని మద్రాసు తీసుకువస్తాడు. మంగమ్మ పెద్ద కథానాయక అవుతుంది. ఎడా,పెడా సినిమాలతో బాగా సంపాదిస్తూ తన చర్యలతో వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఉంటుంది. చివరికీ ఏమైంది అన్నది కథ సారాంశం.

  ఎన్‌.జి.ఓ (N.G.O)

  ఆచార్య ఆత్రేయ రచించిన (36th Hyderabad National Book Fair) ఈ నవల రంగనాథం అనే గుమస్తా పాత్ర చుట్టూ తిరుగుతుంది. మధ్యతరగతి జీవి రంగనాథం పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడుతుంటాడు. లేని పోని భేషజాలకు పోయి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది నవల స్టోరీ.

  అసమర్దుని జీవయాత్ర (Asamardhuni Jeeva Yatra)

  త్రిపురనేని గోపిచంద్ రచించిన ఈ నవలలో సీతారామరావు కథానాయకుడు. ఉన్నత కుటుంబానికి చెందిన అతడు తండ్రి అంత్యక్రియలను గొప్పగా చేసి అప్పుల పాలవుతాడు. ఈ క్రమంలో సీతారామంకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది మిగిలిన నవల వృత్తాంతం.

  కన్యాశుల్కం (Kanyasulkam)

  ఎవర్‌గ్రీన్‌ తెలుగు రచనల్లో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం తప్పక ఉంటుంది. ఇది ఒక సాంఘిక నాటకం. మొదటిసారి 1897లో ప్రచురించబడింది. అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. దానిపై తీవ్ర కలత చెందిన రచయిత ‘కన్యాశుల్కం’ అనే ఒక గొప్ప సాంఘిక నాటకాన్ని రచించాడు. 

  తులసిదళం (Thulasi Dalam)

  యండమూరి వీరేంద్రనాథ్ కలం నుంచి వచ్చిన మరో గొప్ప రచన ‘తులసిదళం’. తులసి అనే పాప చుట్టూ కథ తిరుగుతుంది. తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. తండ్రిపై కోపంతో కొందరు వ్యక్తులు తులిసిపై కాష్మోరా అనే దుష్ట శక్తిని ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.

  షాడో (Shadow)

  డిటెక్టివ్‌ తరహా రచనలను మీరు ఇష్టపడుతుంటే ‘షాడో’ పుస్తకం చక్కటి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. మధుబాబు దీనిని రచించారు. డిటెక్టివ్ నవలలే కాదు కాళికాలయం, వీరభద్రారెడ్డి వంటి ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్‌తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి.

  మరికొన్ని ముఖ్య రచనలు (Other Important Books)

  ప్రజాకవి కాళోజీ రచించిన ‘నా గొడవ’, డైరక్టర్ వంశీ రచించిన ‘మా పసలపూడి కథలు’, యద్దనపూడి సులోచనారాణి ‘జీవన తరంగాలు’, మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘నత్తలొస్తున్నాయి జాగ్రత్త’, మాదిరెడ్డి సులోచన ‘పూల మనసులు’ కూడా మంచి పుస్తకాలుగా గుర్తింపు పొందాయి. అలాగే రంగనాయకమ్మ రచించిన ‘బలిపీఠం’, పొత్తూరి విజయలక్ష్మి ‘హాస్య కథలు’, కె.ఎన్.వై. పతంజలి రాసిన ‘పతంజలి భాష్యం’, శ్రీరమణ గారి ‘మిథునం’ ఇలా చదవ వలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv