ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించే జట్లలో ఆర్సీబీ ముందు వరుసలో ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆ జట్టుకు అభిమానుల బలం కూడా ఎక్కువే. కోహ్లీ, గేల్, డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ RCB ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరలేదు. కొన్నిసార్లు పేలవంగా ఆడి కప్పుకు దూరమైన RCB మరికొన్ని సార్లు ఫైనల్స్ వరకూ వెళ్లినా టైటిల్ గెలవలేకపోయింది. 2009, 2011, 2016 ఇలా మూడుసార్లు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ.. 2010, 2015, 2020, 2021, 2022.. మొత్తం ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌లోకి ఎంటరయ్యింది. ఇంత మంచి ప్రదర్శన చేసిన RCB ఎందుకు టైటిల్ గెలవలేకపోతుందో అర్థంకాక బెంగళూరు అభిమానులు సతమతమవుతున్నారు.15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం RCBకి కలిసిరానుంది. ప్రస్తుతం RCB కీలక ఆటగాళ్లు ఎవరు?. వారి ఫామ్ ఎలా ఉంది? వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
కెప్టెన్‌గా డుప్లెసిస్ సక్సెస్:
మరోవైపు ఎప్పటిలాగానే ఈ సారి కూడా RCB భారీ అంచనాలతో ఐపీఎల్ బరిలో దిగుతోంది. గతేడాది కోహ్లీ ప్లేస్‌లో కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న డుప్లెసిస్(Faf du Plessis).. జట్టును నడిపించడంలో విజయవంతమయ్యాడు. గతేడాది డుప్లెసిస్ నాయకత్వంలో బెంగళూరు జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. టైటిల్ కూడా సాధిస్తుందని RCB అభిమానులు భావించారు. అయితే అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్స్-2లో రాజస్థాన్ చేతిలో ఓడి RCB నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా డుప్లెసిస్ సక్సెస్ కావడం ఆ జట్టుకు ప్రధాన ఊరటగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారైనా RCB టైటిల్ కలను నెరవేరుస్తాడని మేనేజ్‌మెంట్‌తో పాటు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ:
గత కొంత కాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న కింగ్ కోహ్లీ.. ఈ సారి సూపర్ ఫామ్ అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ-20ల్లో సెంచరీలు బాది మునుపటి కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. కోహ్లీ గత పది టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో వరుసగా 50, 26, 64, 12, 62, 82, 49, 3, 63, 11 స్కోరు చేశాడు. కోహ్లీ ఏమేర భీకర ఫామ్‌లో ఉన్నాడో ఈ గణాంకాలను బట్టే అర్థం చేసుకోవచ్చు.ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కోహ్లీ కొనసాగిస్తే RCB కప్ గెలవటం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
డుప్లెసిస్:
కెప్టెన్ డుప్లెసిస్ గత ఐపీఎల్ సీజన్‌లో సూపర్ ఫామ్‌ను కనబరిచాడు. మెుత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు 468 రన్స్ చేశాడు. తద్వారా టాప్ స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఈసారి కూడా డుప్లెసిస్ అదే ఫామ్ కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
ఫిన్ అలెన్(Finn Allen ):
ఆర్సీబీ ప్రధాన బ్యాటర్లలో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ ఒకరు. అయితే గత 10 ఇంటర్నేషనల్ టీ-20ల్లో అలెన్ ఫామ్ పెద్దగా లేనప్పటికీ అతడి ఫామ్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఐపీఎల్ అంటేనే సూపర్ ఫామ్‌లోకి వచ్చే అలెన్ ఈసారి ఆర్సీబీకి కీలక బ్యాటర్‌గా మారే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో RCB మేనేజ్‌మెంట్ అలెన్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది.
మ్యాక్స్‌వెల్(Glenn Maxwell):
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆర్సీబీకి ప్రధాన బలం. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తూ ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టగలడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మ్యాక్స్‌వెల్ తనదైన ముద్ర వేస్తాడు. మ్యాచ్ గమనాన్నే మార్చగల సత్తా మ్యాక్స్‌వెల్‌కు ఉండటంతో RCB అతడిపై చాలా ఆశలే పెట్టుకుంది.
హసరంగా( Hasaranga):
శ్రీలంక ప్లేయర్ హసరంగ RCBకి మరో కీలక ఆల్‌రౌండర్. ప్రస్తుతం RCB స్పిన్ భారాన్ని అతడే మోస్తున్నాడు. మెుత్తం 55 ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్‌లు ఆడిన హసరంగా 89 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్‌లో బెంగళూరు తరపున మెుత్తం 42 ఓవర్లు వేసిన ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ 6.98 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు. ఈ సారి కూడా అదే స్థాయిలో హసరంగ ప్రదర్శన ఉంటే ఆర్సీబీకి తిరుగుండదు.
మహ్మద్ సిరాజ్:
మహ్మద్ సిరాజ్ బెంగళూరు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా తన ఫామ్‌ను కొనసాగిస్తున్న సిరాజ్ ఆర్సీబీకి కీలక బౌలర్‌గా ఎదిగాడు. గత ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 9 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కూడా సిరాజ్ అదే ఫామ్ కొనసాగించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
హర్షల్ పటేల్:
ఆర్సీబీకి ఉన్న కీలక బౌలర్లలో హర్షల్ పటేల్ ఒకరు. హర్షల్ స్లోవర్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గత కొన్ని సీజన్లుగా అంచనాలను అందుకుంటూ హర్షల్ రాణిస్తున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్‌లో హర్షల్ 19 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది