బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ అంకుర సంస్థ ‘నథింగ్’ త్వరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన నథింగ్ ఫోన్-1కు వినియోగ దారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఆ ఫోన్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అదే సంస్థ నుంచి రానున్న రానున్న నథింగ్-2 ఫోన్‌పై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. జూన్ లేదా ఆగస్టులో ఫోన్ విడుదల చేస్తామని కంపెనీ సూచనప్రాయంగా తెలిపింది. ఈ నేపథ్యంలో నథింగ్ ఫోన్ 2 ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? మెుబైల్ లవర్స్ అంచనాలను ఈ ఫోన్ అందుకుంటుందా? ఈ మెుబైల్ ధర, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
అమోల్డ్ స్క్రీన్:
నథింగ్ ఫోన్ 2.. Qualcomm Snapdragon 8 సిరీస్ ప్రాసెసర్‌తో రానుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED స్క్రీన్‌తో రూపొందుతోంది
కెమెరా క్వాలిటీ:
నథింగ్ ఫోన్ 2.. 8GB ర్యామ్‌తో మార్కెట్లోకి రానుంది. దీని ఇంటర్నల్ మెమోరీ 128 GB. ఈ ఫోన్ వెనక వైపున మెుత్తం మూడు అత్యాధునిక కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో రెండు 50 మెగా పిక్సల్స్ కాగా.. మెయిన్ కెమెరాను ఫ్లాగ్షిప్ సోనీ IMX766తో తీసుకువస్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సల్స్‌గా ఉండనుంది. డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టూ ఫోకస్ వంటివి కెమెరా ఫీచర్లుగా ఉన్నాయి. ఇమేజ్ రిజల్యూషన్ 8150 x 6150 Pixels గా ఉంది.
బ్యాటరీ:
నథింగ్ ఫోన్ 2.. Android v13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడవనుంది. ఫోన్ బ్యాటరీ 4700 mAh ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెుబైల్ స్క్రీన్ 6.67 అంగుళాలు (16.94 cm) ఉండనుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 pixels, పిక్సెల్ డెన్సిటీ 395 ppi గా ఉంది.
5జీ సపోర్ట్?
నథింగ్ ఫొన్ 2 5G సపోర్టింగ్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని టెక్ వెబ్సైట్లు 5జీ సపోర్ట్ చేస్తుందని తెలిపాయి. హ్యాండ్ సెట్ లాంఛైతే నెట్వర్క్ కనెక్టివిటీ గురించి పూర్తిగా తెలుస్తుంది.
ఫోన్ సెన్సార్స్:
ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిరోమీటర్, కాంపస్, జైరోస్కోప్ వంటి సెన్సార్లు కూడా ఫోన్లో అందుబాటులో ఉండనున్నాయి.
ధర ఎంతంటే:
నథింగ్ ఫోన్ 1 మోడల్‌ను అన్ని డిస్కౌంట్లు పోనూ రూ.25,999 ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే కొత్తగా రాబోయే నథింగ్ ఫోన్-2 ధర 30వేలకు పైగా ఉండొచ్చని పలు ఈ-కామర్స్ సైట్స్ అంచనా వేస్తున్నాయి. దీని ధర రూ. 35,000-40,000 మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.