• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mystery Temples in India: భారత్‌లో అంతుచిక్కని ఆలయాలు.. సైన్స్‌ కూడా వీటి ముందు ఓడిపోయింది!

    భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. రాజుల కాలం నాటి ఎన్నో పురాతన ఆలయాలు దేశంలో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉన్నాయి. సైన్స్‌ కూడా ఆ ఆలయాల వెనక ఉన్న రహస్యాలను కనిపెట్టలేకపోయింది. దీంతో శతాబ్దాల కాలంగా అవి మిస్టరీగానే మిగిలిపోయాయి. దేశంలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న ఆ టెంపుల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.

    1. బృహదీశ్వర ఆలయం (తమిళనాడు)

    తమిళనాడులోని తంజావూరులో ఉన్న ‘బృహదీశ్వర దేవాలయం’ గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడ కూడా గ్రానైట్ నిక్షేపాలు లేవు. పైగా ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏక శిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయం నిర్మాణం వెనకున్న రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు.

    2. అనంతపద్మనాభ స్వామి గుడి (కేరళ)

    కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో 7 రహస్య ఖజానాలు ఉన్నాయి.  6 రహస్య ఖజానాలను తెరిచి బంగారు ఆభరణాలను లెక్కించారు.  అయితే 7వ ఖజానాను తెరవలేకపోయారు. ఎందుకంటే ఆ గదిని నాగుపాముల ప్రతిమలతో మూసి ఉంచారు. తలుపులకు నాగబంధం వేశారని, బలవంతంగా తెరిస్తే ఉపద్రవం తప్పదని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గది లోపల నుంచి సముద్రపు అలలు శబ్దం వినిపిస్తుందని, తెరిస్తే ఆలయాన్ని నీరు ముంచెత్తుందని కొందరు నమ్ముతున్నారు. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. 

    3. పూరీ ఆలయం (ఒడిశా)

    దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒడిశాలోని పూరి జగన్నాదస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంపైన ఉన్న జెండ గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రతి రోజూ ఓ పూజారి 45 అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు. సుమారు 1800 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ జెండాను ఏ రోజైనా మార్చని యెడల ఆలయాన్ని 18 ఏళ్లపాటు ఆలయాన్ని మూసివేయాల్సి ఉంటుందని అక్కడి పూజారులు చెబుతుంటారు. 

    4. శ్రీ విజయ విట్టల దేవాలయం (కర్ణాటక)

    కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది.15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో-రె-మి-స సంగీత స్వరాలు వినిపిస్తాయి. అయితే ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ఆలయానికి వచ్చే భక్తులు స్తంభాలు చేసే సంగీత స్వరాలు విని ఆశ్చర్యపోతుంటారు. 

    5. లేపాక్షి ఆలయం (ఆంధ్రప్రదేశ్)

    ఏపీలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు. అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ పరిసరాల్లో ఉండే 70 స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది. వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది. ఎంతోమంది ఇంజనీర్లు ఈ రహాస్యాన్ని ఛేదించేందుకు యత్నించి విఫలమయ్యారు. 

    6. జ్వాలా దేవి ఆలయం (హిమాచల్‌ ప్రదేశ్‌)

    హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో జ్వాలా దేవి ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల వందల సంవత్సరాలుగా  వెలుగుతూనే ఉంది. ఇంధనం, నూనె పోయకుండానే జ్వలిస్తోంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి.ఈ జ్వాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. జ్వాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోతుంటారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv