కష్టం వస్తే ఓదార్చేది అమ్మ.. కానీ, ఆ కష్టం రాకుండా చూసుకునే వాడే నాన్న. నాన్న మనసు సున్నితం. హృదయం కోమలం. తన పిల్లలపై ప్రేమను చూపించుకోలేడేమో.. కానీ, ఆ ప్రేమను నిరూపించుకోగలడు. తప్పు చేస్తే శిక్షిస్తూనే క్రమశిక్షణ నేర్పిస్తాడు. మందలిస్తూనే మాధుర్యం పంచుతాడు. దండిస్తూనే దారి చూపిస్తాడు. పిల్లల విజయం కోసం నాన్న ఓడిపోతాడు. సంతోషం కోసం త్యాగం చేస్తాడు. అందుకే నాన్నంటే మనందరికీ ఎంతో స్పెషల్. ఈ ఫాదర్స్ డే(June 18)కి గుర్తుగా చిరు కానుకలు ఇద్దాం. నాన్న చేసిన త్యాగాలకు కృతజ్ఞత చూపుదాం.
గ్యాడ్జెట్స్
నాన్న చేతికి గడియారాన్ని మనందరం చూసే ఉంటాం. అలా గడియారం పెట్టుకుని నడుస్తుంటే ఆ ఠీవీయే వేరు. అయితే, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఓ స్మార్ట్‌వాచీని గిఫ్టుగా ఇవ్వండి. వీటిల్లో బ్లడ్ ప్రెషర్(బీపీ), హార్ట్ బీట్, షుగర్ లెవెల్స్, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి సహాయంతో రోజువారీగా హెల్త్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. పైగా, ఎంత సమయం పాటు నిద్రపోయారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు స్మార్ట్ గ్యాడ్జెట్స్నీ ట్రై చేయొచ్చు.
Buy Now
ఎక్సర్సైజ్ కిట్
వయసు మీరుతున్న కొద్దీ ఆరోగ్యంపై పట్టు తప్పుతుంది. పిల్లల పెంపకంలో పడి శరీరాన్ని గుల్ల చేసుకున్న తండ్రులకు ఇప్పుడు తగినంత విరామం కావాలి. అదే సమయంలో ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవాలి. కాబట్టి, వీరికి ఎక్సర్సైజ్ కింట్ ఎంతో అవసరం. జాగింగ్ షూ, రిస్ట్ బ్యాండ్, ప్రొటీన్ షేక్ బాటిల్.. ఇలా వ్యాయామానికి అవసరమయ్యే సామగ్రిని సమకూర్చే ప్రయత్నం చేయండి. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నని ఖుషీ చేయండి.
Buy Now
చైర్/బెడ్
పదవీ విరమణ చేసి ఇళ్లలో ఉంటూ శేష జీవితాన్ని గడిపే నాన్నల కోసం ఓ కుర్చీ లేదా బెడ్ని బహూకరించండి. మామూలు కుర్చీ కాకుండా, బహు విధాలుగా ఉపయోగపడే చైర్‌ని గిఫ్టుగా ఇవ్వండి. నడుం వాల్చడానికి అనువుగా, చదవడానికి వీలుగా ఉండే కుర్చీని ఆర్డర్ చేయండి. ఆన్లైన్లో ఇలాంటి కుర్చీలు అందుబాటులో ఉన్నాయి. స్టోర్లలోకి వెళ్లి కావాల్సిన డిజైన్‌తో ప్రత్యేకంగా వీటిని చేయించుకోవచ్చు కూడా. ఈ ఫాదర్స్ డేకి గిఫ్టుగా ఇచ్చి సంతోష పరచండి.
Buy Now
షేవింగ్ కిట్
చాలా మంది నాన్నలకు స్వతహాగా షేవింగ్ చేసుకోవడం అలవాటు. కాకపోతే, చాలా మంది బ్లేడు, కత్తెరలతో షేవ్ చేసుకుంటుంటారు. బ్లేడు చాలా పదునైనది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదమే. కాబట్టి, నాన్నలకు ఓ ట్రిమ్మర్‌ని బహూకరించండి. సేఫ్టీతో పాటు మన్నిక కలిగిన ట్రిమ్మింగ్ మిషిన్లను ఆర్డర్ చేయండి. ట్రిమ్మర్‌తో పాటు ఓ మిర్రర్, బాడీ కర్టెయిన్ని నాన్నకి గిఫ్టుగా ఇవ్వండి.
Buy Now
నాన్న కోరిక ప్రకారం..
సర్ప్రైజు గిఫ్టులు ఇవ్వడం బాగుంటుంది. కానీ, సర్ప్రైజు కన్నా అవసరం ఉన్న వాటిని ఇవ్వడం ఎంతో ఉపయోగకరం. కాబట్టి, మీ నాన్నకు ఇష్టమైన వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గతంలో ఆయన కొనాలని అనుకుని వెనకడుగు వేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో పరిశీలించండి. ఇష్టమైన వస్తువులు లేదా మక్కువతో చేసే పనులకు అవసరమైన సామగ్రి వంటి వాటిని గిఫ్టుగా ఇవ్వండి. ఉదాహరణకి, కొందరు నాన్నలకు రోజూ ఒక పెగ్ తాగడం అలవాటు ఉంటుంది. అలాంటి వారికి ఓ మంచి గ్లాసును ఇవ్వండి. దానిని చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు. మీ కోసం చేసిన త్యాగాలు, పడిన కష్టాలు అన్నింటినీ గుర్తు చేసుకుని సంతోషపడతారు.